Temples To Pay Tax : బీహార్ లో ఆలయాలపై పన్ను!

దేవాల‌యాల విషయంలో బీహార్‌ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బీహార్‌లో భ‌క్తులు సంద‌ర్శించే పత్రి ఆల‌యాన్ని ప్ర‌భుత్వం వ‌ద్ద రిజిస్ట‌ర్ చేయించుకుని ఆపై

Temples To Pay Tax : బీహార్ లో ఆలయాలపై పన్ను!

Bihar3

Temples To Pay Tax :  దేవాల‌యాల విషయంలో బీహార్‌ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బీహార్‌లో భ‌క్తులు సంద‌ర్శించే పత్రి ఆల‌యాన్ని ప్ర‌భుత్వం వ‌ద్ద రిజిస్ట‌ర్ చేయించుకుని ఆపై వాటికి వ‌చ్చే ఆదాయంలో 4 శాతం ప‌న్ను చెల్లించాల‌ని బీహార్ రాష్ట్ర ధార్మిక ట్ర‌స్ట్ బోర్డు ఆదేశించింది.

వ్యక్తులు త‌మ ఇంటి ప్రాంగణాల్లో(ప్ర‌హ‌రీ గోడకు వెలుప‌ల) దేవాల‌యాలు నిర్మించి భ‌క్తుల‌ను అనుమ‌తించినా కూడా వాటిని ప‌బ్లిక్‌గా ప‌రిగ‌ణించి ప‌న్ను విధిస్తామ‌ని ధార్మిక ట్ర‌స్ట్ బోర్డు పేర్కొంది. బిహార్ రాష్ట్ర ధార్మిక ట్ర‌స్ట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణ‌యం వివాదాస్ప‌ద‌మైంది.

ఈ నిర్ణ‌యంపై ధార్మిక సంస్ధ‌లు, భ‌క్తులు భ‌గ్గుమంటున్నారు. ఆల‌యాల‌పై ప‌న్ను విధింపు నిర్ణయాన్ని ‘జిజియా ప‌న్ను’ గా శ్రీరామ జ‌న్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ స‌భ్యులు కామేశ్వర్‌ చౌపాల్ అభివ‌ర్ణించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, ఏఐఎంఐఎం పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే దీనిపై బీహార్‌ ప్రభుత్వం స్పందిస్తూ.. ఆల‌యాల‌పై తాము ప‌న్ను విధించ‌లేద‌ని తెలిపింది. అయితే అది కేవ‌లం వార్షిక సేవా రుసుమ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.

ALSO READ New Uniform For Indian Army: ఆర్మీకి కొత్త యూనిఫాం!