Bsf : టెన్త్ పాస్‌తో BSFలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

దరఖాస్తు విధానానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.దరఖాస్తుకు డిసెంబర్ 29, 2021 వరకు అవకాశం ఉంది.

Bsf : టెన్త్ పాస్‌తో BSFలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

Bsf Recruitment

Bsf : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ ఎఫ్ ) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో 72 కానిస్టేబుల్ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం ఖాళీలు 72.

గ్రూప్ సి విభాగంలోకి వచ్చే ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ పోస్టులకు పదవతరగతిని విద్యార్హతగా నిర్ణయించారు. ఆయా పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు జీతం ఇవ్వబడుతుంది. కాగా, ఏఎస్‌ఐ పోస్టుకు రూ.29200 నుంచి రూ.92300, హెచ్‌సీ పోస్టుకు రూ.25500 నుంచి రూ.81100 వరకు జీతం ఇవ్వనున్నారు.

ఎంపిక విధానం విషయానికి వస్తే దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. కెటగిరీల వారీగా అర్హత మార్కులు సాధించాలి. ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటన్నింటిలో ఉత్తీర్ణత సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.దరఖాస్తుకు డిసెంబర్ 29, 2021 వరకు అవకాశం ఉంది. నోటిఫికేషన్‌, దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/#bsf-current-openings ను సందర్శించాల్సి ఉంటుంది.