Uttarakhand: ఇకపై మతం మార్చాలని చూస్తే పదేళ్ల జైలు శిక్ష, జరిమాన.. బిల్లు ఆమోదించిన ఉత్తరాఖండ్

మత మార్పిడి నిరోధక బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం... ఎవరైనా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.

Uttarakhand: ఇకపై మతం మార్చాలని చూస్తే పదేళ్ల జైలు శిక్ష, జరిమాన.. బిల్లు ఆమోదించిన ఉత్తరాఖండ్

Uttarakhand: మత మార్పిడి నిరోధక బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇకపై చట్ట వ్యతిరేకంగా మత మార్పిడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. నాన్-బెయిలబుల్ కేసుతోపాటు, గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో బుధవారం ఆమోదించారు.

Bihar: తెల్లారేసరికి మాయమైన రెండు కిలోమీటర్ల రోడ్డు.. గ్రామస్తుల ఆశ్చర్యం.. అసలేం జరిగింది?

ఉత్తరాఖండ్ ‘ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ (అమెండ్‌మెంట్) యాక్ట్, 2022’ పేరిట ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. దీని ప్రకారం బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే రూ.50,000 జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఇందులో బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డ వ్యక్తులు.. బాధితులకు నష్ట పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే బాధితులకు గరిష్టంగా రూ.5 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దీనికి సంబంధించి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎవరూ ఎవరినీ మతం మార్పించేందుకు ప్రయత్నించకూడదు. వేరే వేరే మతం వాళ్లను తమ మతంలోకి రమ్మని ఆహ్వానించకూడదు. ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకూడదు.

Karnataka: 205 కేజీల ఉల్లిపాయల్ని 8 రూపాయలకే అమ్మిన రైతు.. వైరల్ అవుతున్న రశీదు

ఇవి నిరూపణ అయితే జైలు శిక్ష, జరిమానాతోపాటు, బాధితులకు నష్ట పరిహారం అందించాల్సి ఉంటుంది. ఈ బిల్లుతోపాటు మహిళల కోటాకు సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ సర్వీసుల్లో 30 శాతం సమాంతర రిజర్వేషన్లు కల్పిస్తారు.