Punjab : సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత

పంజాబ్ సీఎం అమరేందర్ ఇంటివద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పంజాబ్ లో వ్యాక్సిన్ స్కామ్ జరిగిందని గత కొద్దీ రోజులుగా ప్రతిపక్ష పార్టీ శిరోమణి అకాళీదర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది.

Punjab : సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత

Punjab

Punjab : పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. పంజాబ్ లో వ్యాక్సిన్ స్కామ్ జరిగిందని గత కొద్దీ రోజులుగా ప్రతిపక్ష పార్టీ శిరోమణి అకాళీదర్, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది.

ఇక ఈ నేపథ్యంలోనే మంగళవారం సీఎం ఇంటి ముట్టడికి పిలుపునించింది. దీంతో వేలాది మంది శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. వ్యాక్సిన్ స్కామ్ పై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు అకాలీదళ్ నేతలు.

భారికేట్లను తొలగించి సీఎం ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు ఆందోళన కారులు.. పరిస్థితి అదుపుతప్పుతుందని గ్రహించిన పోలీసులు ఆందోళనకారుపై వాటర్ కెనాన్ ప్రయోగించి చెదరగొట్టారు. అనంతరం ఆందోళన కారులను అక్కడి నుంచి తరలించారు పోలీసులు.