స్వామి శరణం అయ్యప్ప : పంబ దగ్గరకు చేరుకున్న మహిళలు

  • Published By: madhu ,Published On : November 16, 2019 / 10:11 AM IST
స్వామి శరణం అయ్యప్ప : పంబ దగ్గరకు చేరుకున్న మహిళలు

శబరిమలలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. పంబ దగ్గరకు ఐదుగురు మహిళలు చేరుకున్నారు. అక్కడనే ఉన్న పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. ఈ ఘటన 2019, నవంబర్ 16వ తేదీ శనివారం చోటు చేసుకుంది. 10 నుంచి 50 ఏళ్లలోపు వారికి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. స్వామి వారిని దర్శించుకుని తీరుతామని ప్రకటిస్తున్న..మహిళలకు భద్రత కల్పించలేమని కేరళ సర్కార్ స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం శబరిమల ఆలయ తలుపుతు తెరవనున్నారు. దీంతో ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. 30మందికి పైగా మహిళలు అయప్ప ఆలయ దర్శనం కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం. 

మరోవైపు మహిళలు ఆలయ ప్రవేశంపై సీపీఎం రాష్ట్ర కార్యవర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రచారం కోసం ఆలయ ప్రవేశం చేయాలనుకునే మహిళలను ప్రభుత్వం ప్రోత్సహింబోదని తెలిపింది. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకూ మహిళలకు ఆలయ ప్రవేశ అవకాశం కల్పించకూడదంది. ఇటు శబరిమలలో మహిళల ప్రవేశం అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించినందున గత ఏడాది ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదని కేరళ ప్రభుత్వానికి అటార్నీ జనరల్ వేణుగోపాల్ న్యాయ సలహా ఇచ్చారు. 

ఇదిలా ఉంటే…ప్రభుత్వం తరపున రక్షణ కల్పించినా.. కల్పించకపోయినా నవంబర్‌ 20 తర్వాత శబరిమలకు వెళ్లి తీరతానని మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ అన్నారు. కేరళ ప్రభుత్వం నుంచి రక్షణ కోరతానని.. అయితే భద్రత కల్పించాలా.. వద్దా అనే అంశాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నానని చెప్పారు. ఒకవేళ ఇవ్వకపోయినా తాను అయ్యప్ప దర్శనార్థం శబరిమలను సందర్శిస్తానని తృప్తి దేశాయ్ ప్రకటించారు.  
Read More : శబరిమలైలో ఏం జరుగబోతోంది : తెరుచుకోబోతున్న సన్నిధానం