మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2019 / 09:19 AM IST
మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే

అబుదాబీలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)సదస్సులో శుక్రవారం(మార్చి-1,2019) భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అపారమైన పరిజ్ణానం, శాంతి, నమ్మకం, సాంప్రదాయం, అనేకమతాలకు నిలయం, అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన దేశపు ప్రతినిధిగా తాను ఇక్కడ ఉన్నాను అని ఆమె అన్నారు.  

ఈ సందర్భంగా పాక్ లక్ష్యంగా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. భూమిపై మనిషి మిగలాలంటే..ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలకు గట్టి సందేశమివ్వాలని, వాళ్ల దేశాల్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయాలన్నారు. వాళ్లకి సాయం నిలిపేయాలన్నారు. టెర్రరిజమ్ వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయని, ప్రాంతాలు అస్థిరమైపోతున్నాయని, ప్రపంచాన్ని పెద్ద ప్రమాదంలోకి  నెడుతుందని ఆమె అన్నారు.
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

భారత ప్రధాని నరేంద్ర మోడీ,18.5 కోట్ల మంది ముస్లిం అన్నదమ్ములు,అక్కచెల్లెల్లతో కలిపి 130 కోట్ల మంది భారతీయుల గ్రీటింగ్స్ ను తాను తీసుకొచ్చినట్లు తెలిపారు. భారత్ లోని ముస్లిం తమ నమ్మకాలను తాము నమ్ముతూనే ఇతర మతాల ప్రజల నమ్మకాలను గౌరవిస్తున్నారని, హిందూ,ముస్లింలు భారత్ లో కలిసిమెలిసి జీవిస్తున్నారని, కొంతమంది మాత్రమే ఉగ్రవాదంపై ఆకర్షితులయ్యారని ఆమె అన్నారు. ఇదే భిన్వత్వంలో ఏకత్వం గొప్పతనమని ఉగ్రవాదంపై పోరు ఏ మతానికి వ్యతిరేకం కాదని, అన్ని దేశాలు ఉగ్రవాదంపై పోరులో భాగస్వాములవ్వాలన్నారు.
Read Also : మోడీకి లేఖాస్త్రం : మరోసారి బ్లాక్ డ్రెస్‌లో బాబు

ఇస్లాం అంటే శాంతి అని ఎలా అంటారో.  ప్రతి మతం కూడా అలాంటిదే. అల్లాకి ఉన్న 99 పేర్లలో ఏదీ హింసను సూచించదు. ప్రతి మతం కూడా శాంతికి కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా రుగ్వేదంలోని ఓ వాక్యాన్ని ఆమె చదివి వినిపించారు. ఏకమ్ సత్ విప్ర బహుద వధంతి అని చెబుతూ..దీనికి అర్థం దేవుడు ఒక్కడే కానీ జ్ణానం తెలిసిన మనుషులు ఎన్నో విధాలుగా ఆయనను వర్ణించారు అని సుష్మా వివరించారు.

Read Also : ఆధార్ అప్ డేట్ : ఇకపై ఆ మూడింటికీ తప్పనిసరి