ప్రధాని హెచ్చరికలు : ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం..

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 06:40 AM IST
ప్రధాని హెచ్చరికలు : ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం..

ఢిల్లీ: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాది దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని..అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను దోషిగా నిలబెతామని  ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లకు అండగా ఉంటామన్నారు. అమర జవాన్లకు నివాళులు అర్పించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..భారత జవాన్ల  ధైర్య సాహసాలు అపారమైనవనీ..దాడికి పాల్పడివారిన వదిలేదనీ దీనికి ద్రోహులు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చిరించారు.  భారత్‌లో అస్థిరత్వం సృష్టించేందుకు ఉగ్ర సంస్థలు చేస్తున్న  ప్రయత్నాలు సాగనీయమన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి అమానవీయ దాడులను ఖండించాల్సిందేనని పునరుద్ఘాటించారు.

 
ఉగ్రాదాడి నేపథ్యంలో మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాలకు ప్రదాని  ధన్యవాదాలు తెలిపారు. మానవతావాదులంతా కలిసి పోరాడాల్సిన సమయం ఇదని..తీవ్రవాదులను అణచివేసేందుకు ప్రతీ ఒక్కరూ ఒక్కటై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పుల్వామా దాడి తర్వాత మనసంతా దుఃఖంతో నిండిపోయిందనీ..ఇటువంటి పిరికి చర్యలకు భయపడేది లేదనీ..భారత్ వెనకడుగు వేసే దేశం కాదన్నారు.దేశ రక్షణ.. సమృద్ధి అనే రెండు కలలతో సైనికులు జీవిస్తుంటారని.. ఆ కలల్ని సాకారం చేసేందుకు ప్రతీ ఒక్కరూ ప్రతీ క్షణం పాటుపడదామని ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగంతో ప్రసంగించారు.