జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర వేట: ఎన్‌కౌంటర్‌లో టెర్రరిస్టు హతం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర వేట కొనసాగుతోంది. భద్రతా బలగాలు టెర్రరిస్టులను ఏరిపారేసే పనిలో ఉన్నాయి. హంద్వారా క్రాల్ గండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో

  • Published By: veegamteam ,Published On : March 7, 2019 / 03:11 AM IST
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర వేట: ఎన్‌కౌంటర్‌లో టెర్రరిస్టు హతం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర వేట కొనసాగుతోంది. భద్రతా బలగాలు టెర్రరిస్టులను ఏరిపారేసే పనిలో ఉన్నాయి. హంద్వారా క్రాల్ గండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో

జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర వేట కొనసాగుతోంది. భద్రతా బలగాలు టెర్రరిస్టులను ఏరిపారేసే పనిలో ఉన్నాయి. హంద్వారా క్రాల్ గండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడి నుంచి ఆయుధాల, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కాశ్మీర్ లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం(మార్చి-7-2019) అర్థరాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
Also Read: పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

భద్రతా దళాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ లో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పులను తిప్పికొడుతూ భద్రతా దళాలు జరుపుతున్న ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు హతమవుతున్నారు. హంద్వారా క్రాల్ గండ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే సమాచారంతో గత రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. క్రాల్ గండ్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేశారు. దీంతో ఆ గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ముష్కరులను ఏరిపారేసే పనిని ముమ్మరం చేశాయి. రాత్రి, పగలు తేడా లేకుండా టెర్రరిస్టుల కోసం సెర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి తర్వాత… ఆ దాడి సూత్రధారులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత ముష్కరులను వెతికివెతికి మట్టుబెడుతున్నారు.
Also Read: తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు