Katra Bus Fire: కత్రా బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనే: జాతీయ దర్యాప్తు సంస్థ
జమ్మూకాశ్మీర్‌లోని రియాసీ జిల్లా కత్రాలో జరిగిన బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనేనని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం తేల్చింది.

Katra Bus Fire: జమ్మూకాశ్మీర్‌లోని రియాసీ జిల్లా కత్రాలో జరిగిన బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనేనని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం తేల్చింది. కత్రాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ‘అంటుకునే బాంబును’ ఉపయోగించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఎన్ఐఏ దర్యాప్తుకు బలం చేకూర్చుతూ “జమ్మూ కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్” అనే ఉగ్రవాద సంస్థ ఈఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. వైష్ణోదేవి యాత్రకు బేస్ క్యాంపుగా చెప్పుకునే కత్రాలో శుక్రవారం కొందరు యాత్రికులు బస్సులు వెళ్తుండగా..బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈఘటనలో బస్సులో ఉన్న నలుగురు యాత్రికులు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాదంపై స్పందించిన స్థానిక అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Other Stories: Gun Firing in US: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం: 13 మంది మృతి
ఇప్పటికే కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుండగా, ప్రస్తుత బస్సు ప్రమాద ఘటన యాత్రపై ఆందోళన కలిగించింది. ఈనేపథ్యంలోనే ఈఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మర విచారణ జరిపింది. శనివారం ఘటనా స్థలాన్ని గంటన్నర పాటు పరిశీలించిన దర్యాప్తు బృందం..ఉగ్రవాదులు పేలుడికి ఉపయోగించిన పదార్ధాలను గుర్తించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించింది. ఘటనలో గాయపడిన వారికి రూ. లక్ష పరిహారం ప్రకటించింది. దాడి ఘటనలో విచారణ కొనసాగుతోందని..నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ (ADG), ముఖేష్ సింగ్ తెలిపారు.
1IPL2022 RCB Vs GujaratTitans : పాండ్య కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
2Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
3NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
4She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
5Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
6Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
7Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
8Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
9Guinness World Record: గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం 36 గంటల పాటు ఊయలూగుతూ..
10Delhi Metro: కేబుల్ ఎత్తుకెళ్లిన దొంగలు.. నెమ్మదిగా నడుస్తున్న మెట్రో రైళ్లు
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!