TMC : హలో..నీ డెత్ సర్టిఫికెట్ రెడీ..వచ్చి పట్టుకెళ్లు..

బతికున్న వ్యక్తికే ఫోన్ చేసి ‘హలో..నీ డెత్​ సర్టిఫికేట్​ రెడీగా ఉంది వచ్చి తీసుకెళ్లు అని ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? షాక్ అవుతాం కదూ..నిజమే మరి..కానీ థానే మున్సిపల్ అధికారులు..స్వయంగా ఆ వ్యక్తికే డెత్​ సర్టిఫికెట్ తీసుకెళ్లమని ఫోన్ చేసి మరీ చెప్పారు.

TMC : హలో..నీ డెత్ సర్టిఫికెట్ రెడీ..వచ్చి పట్టుకెళ్లు..

Municipal Authorities

Thane Man receives death certificate shocks call : చనిపోయిన వ్యక్తులకు డెత్ సర్టిఫికెట్ ఇమ్మంటే లంచం ఇస్తేనే గానీ పని జరగదు అనే అధికారులు గురించి విన్నాం. బతికున్నవ్యక్తులు చనిపోయారని డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఘటనల గురించి కూడా విన్నాం. కానీ ఏకంగా బతికున్న వ్యక్తికే ఫోన్ చేసి ‘నీ డెత్​ సర్టిఫికేట్​ రెడీగా ఉంది వచ్చి తీసుకెళ్లు అని ఫోన్ చేసిన అధికారుల గురించి ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? అటువంటి ఘనకార్యమే చేశారు మహారాష్ట్రలోని థానే మున్సిపల్ అధికారులు. బతికే ఉన్న 55 ఏళ్ల వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు థానే మున్సిపల్​ అధికారులు. అంతేకాదు..స్వయంగా ఆ వ్యక్తికే డెత్​ సర్టిఫికెట్ తీసుకెళ్లమని ఫోన్ చేసి మరీ చెప్పారు. తనకు వచ్చిన ఫోన్ లో విషయాలు విన్న సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. హా ఏంటి సార్ అంటూ మరోసారి అడిగాడు. మళ్లీ అదే మాట చెప్పారు సదరు ప్రబుద్ధులు. దీన్నిబట్టి చూస్తే సరదు అధికారులు నిర్వాకం ఏంటో ..ఊహించుకోవచ్చు.

థానె మున్సిపాలిటీ పరిధిలో 55 ఏళ్ల స్కూల్ టీచర్ చంద్రశేఖర్​ దేశాయ్ నివసిస్తున్నారు. చంద్రశేఖర్ ఘాట్కోపర్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు గత మంగళవారం (జూర్30,2021) మున్సిపల్ ఆఫీస్​ నుంచి ఓ ఫోన్ కాల్​ వచ్చింది. థానే మున్సిపల్​ ఆఫీస్​ నుంచి మాట్లాడుతున్నామని.. చంద్రశేఖర్​ జోషి డెత్​ సర్టిఫికెట్​ ను రెడీ చేశామని వచ్చి తీసుకెళ్లండీ అంటూ చెప్పారు. ఆ మాటలు విన్న చంద్రశేఖర్​ అవాక్కయ్యారు. ఆ మాటల నుంచి కోలుకోవటానికి కొంచెం టైమ్ పట్టిందాయనకు.

కోలుకుని మరోసారి అడిగారు ఏంటీ సార్ మీరు చెప్పేది? అంటూ దానికి మున్సిపల్ అధికారులు ఏమాత్రం తడుముకోకుండా మళ్లీ అదే మాట చెప్పారు. దానికి చంద్రశేఖర్ కు మండిపోయింది.కాస్త వెటకారంగా ‘హలో సార్..మీరు ఇప్పుడు మాట్లాడుతుంది ఆ మరణించిన వ్యక్తితోనే..మీరు డెత్ సర్టిఫికెట్ రెడీ చేసిన వ్యక్తితోనే.. ఎప్పుడు రమ్మంటారు? నా డెత్ సర్టిఫికెట్ కలెక్ట్ చేసుకోవటానికి’? అని అడుగగా..ఈ సారి షాక్ అవ్వటం సదరు అధికారి వంతు అయ్యింది. దానికి మాట మారుస్తూ..‘మీ కుటుంబంలో ఎవరైనా కోవిడ్​తో మరణించారా? అని ప్రశ్నించారు. దానికి చంద్రశేఖర్ లేదని చెప్పడంతో ఫోన్​ కట్ చేశారు. అదే విషయాన్ని చంద్రశేఖరే స్వయంగా తెలిపారు.

అధికారులు ఫోన్ కట్ చేశాక చంద్రశేఖర్ దేశాయ్ ..అసలు జరిగింది ఏంటో తెలుసుకునేందుకు థానే మున్నిపల్​ కార్పొరేషన్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ తన పేరుతోను అన్ని వివరాలతోను ఉన్న డెత్ సర్టిఫికెట్​ అడిగి తీసుకని దాన్ని పూర్తిగా పరిశీలించి మరోసారి అవాక్కయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నుంచి వచ్చిన సమాచారం ప్రకారం..చంద్రశేఖర్ దేశాయ్ 2021 ఏప్రిల్ 22 న మరణించాడని అందులో ఉంది. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందనే విషయంపై అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు. ఇది చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థంకాలేదని వాపోయారు.

కాగా..గత అక్టోబర్‌లో చంద్రశేఖర్ దేశాయ్ కి కోవిడ్​ సోకింది. ఇంట్లో ఉండే చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారు. ఆయన క్వారంటైన్​లో ఉండగా హెల్త్​ వర్కర్స్​ నుంచి ఫోన్​ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు డెత్​ సర్టిఫికెట్​ గురించి మరోసారి ఫోన్​ చేశారని చెప్పుకొచ్చాడాయన.