రాహుల్,ఏచూరిపై పరువునష్టం దావా…విచారణ వాయిదా

  • Published By: venkaiahnaidu ,Published On : April 30, 2019 / 11:58 AM IST
రాహుల్,ఏచూరిపై పరువునష్టం దావా…విచారణ వాయిదా

జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్‌కు ముడిపెట్టడం ద్వారా సంస్థ ప్రతిష్ఠకు రాహుల్, ఏచూరి భంగం కలిగించారని ఆర్ఎస్ఎస్ కార్యకర్త  వివేక్ చాంపనేర్కర్ థానే కోర్టుని ఆశ్రయించారు. రూపాయి చొప్పున రాహుల్,ఏచూరిలపై పరువునష్టం దావా వేశారు. ఏప్రిల్-3,2019న థానే కోర్టు రాహుల్,ఏచూరిలకు సమన్లు పంపింది. 2019,ఏప్రిల్-30న కోర్టు ముందు హాజరుకావాలని ఇద్దరినీ ఆదేశించింది.

అయితే వేక్ చాంపనేర్కర్ వేసిన పరువునష్టం దావా పిటిషన్ పై తుదుపరి విచారణను జులై-1,2019కి వాయిదా వేస్తున్నట్లు ఇవాళ(ఏప్రిల్-30,2019)థానే కోర్టు తెలిపింది.