హత్య కేసులో రాహుల్ కి సమన్లు

  • Published By: venkaiahnaidu ,Published On : April 3, 2019 / 03:25 PM IST
హత్య కేసులో రాహుల్ కి సమన్లు

జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బుధవారం(ఏప్రిల్-3,2019) థానే కోర్టు బుధవారం(ఏప్రిల్-3,2019) సమన్లు పంపింది.లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్‌కు ముడిపెట్టడం ద్వారా సంస్థ ప్రతిష్ఠకు రాహుల్, ఏచూరి భంగం కలిగించారని ఆర్ఎస్ఎస్ కార్యకర్త  వివేక్ చాంపనేర్కర్ కోర్టుకు తెలిపారు.రూపాయి చొప్పున వారిపై పరువునష్టం దావా వేశారు.వివేక్  పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం రాహుల్,ఏచూరిలకు సమన్లు పంపిన కోర్టు 2019,ఏప్రిల్-30న కోర్టు ముందు హాజరుకావాలని ఇద్దరినీ ఆదేశించింది.

2017,సెప్టెంబర్-5న బెంగళూరులోని తన ఇంటి ఆవరణలో గౌరీ లంకేష్ హత్యకు గురైన విషయం తెలిసిందే.ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, ఆర్ఎస్‌ఎస్ వ్యక్తుల వల్లే గౌరీ లంకేష్ హత్య జరిగిందని ఏచూరి గతంలో విమర్శించారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఒత్తిళ్లు తేవడం, దాడులు, చివరకు చంపడానికి కూడా వెనుకాడటం లేదని గతంలో రాహుల్ అన్నారు.