Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకోకపోతే..బస్సులోకి అనుమతి లేదు

వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసే వారిపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానే మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకోకపోతే..బస్సులోకి అనుమతి లేదు

Thane

Thane Municipality key decision : కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పింది. మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. పలు దేశాల్లో వైరస్‌ విజృంభిస్తోంది. ఈనేపథ్యంలో దేశానికి మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న ఆందోళన నెలకొంది. దీంతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు.

వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసే వారిపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానే మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వారిని పబ్లిక్ బస్సుల్లో ప్రయాణాలకు అనుమతించబోమని ప్రకటించింది.

Tulasireddy : వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు దొందూ దొందే : తులసిరెడ్డి

బస్సులో ప్రయాణించే వారు తప్పకుండా వ్యాక్సిన్‌ ధ్రువీకరణను చూపాలని తెలిపింది. నగర మేయర్ నరేష్ మాస్కే ఈ మేరకు శనివారం (నవంబర్13, 2021) ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెలాఖరులోపు 100 శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం కోసం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఒక్క డోసు అయినా తీసుకోని ఉద్యోగులకు జీతాలు చెల్లించబోమని థానే పాలక మండలి ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే.