కాంగ్రెస్ కు థ్యాంక్స్ : సిన్హా కాంగ్రెస్ చేరికపై జైట్లీ సెటైర్

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2019 / 02:30 PM IST
కాంగ్రెస్ కు థ్యాంక్స్ : సిన్హా కాంగ్రెస్ చేరికపై జైట్లీ సెటైర్

కాంగ్రెస్‌ పార్టీకి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం (మార్చి-29,2019) కృతజ్ఞతలు చెప్పారు. అయితే జైట్లీ కాంగ్రెస్ కు కృతజ్ణతలు చెప్పడం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అవును ఇది నిజమే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గురువారం బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా కలిశారు.
Read Also : కేసీఆర్ సర్వే : బీజేపీకి వచ్చేది 150 సీట్లే

త్వరలోనే తాను అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నట్లు సిన్హా ప్రకటించారు. అంతేకాకుండా మరికొందరు బీజేపీ నాయకులు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయిన తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ… బీజేపీకి చెందిన కొందరు మాజీ నేతలను కాంగ్రెస్‌ తమకు కానుకగా భావిస్తూ పార్టీలో చేర్చుకుంటోంది.

అందుకు మేం కాంగ్రెస్‌ కు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా సమస్య ఇప్పుడు మీ పార్టీలో ఉంది. గుడ్‌ లక్‌.. థ్యాంక్యూ కాంగ్రెస్ అంటూ జైట్లీ ఫేస్‌బుక్‌ బ్లాగ్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల మహాకూటమిపై కూడా జైట్లీ విమర్శలు చేశారు. మహాకూటమి ఓ సర్కస్‌లా ఉందని అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా ఇంతవరకూ కూటమి ఏర్పడలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలకు సరైన నాయకుడు లేడని, స్థిరత్వం లేదన్నారు.
Read Also : దేన్నీ వదలటం లేదు : రైల్వేలో టీ కప్పులపై మోడీ చౌకీదార్