Omicron Variant: ఒమిక్రాన్‌ రెండు కొత్త లక్షణాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక!

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది.

Omicron Variant: ఒమిక్రాన్‌ రెండు కొత్త లక్షణాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక!

India Omicron Cases In India Has Risen To 1700

Omicron Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో కూడా ఓమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగిపోతూ ఉన్నాయి. ఒమిక్రాన్ వేగం ప్రజలను భయపెట్లేస్తుండగా.. ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

అయితే, కొత్తగా వస్తున్న కరోనా కేసుల్లో రెండు కొత్త లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి వికారం, ఆకలి మందగించడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ మాట్లాడుతూ, వ్యాక్సిన్ రెండు డోస్‌లు లేదా బూస్టర్ డోస్‌లు తీసుకున్నవారిలో లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.

ఒమిక్రాన్ లక్షణాలు ఏమిటి?
ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారటం, జ్వరం, కండరాల నొప్పులు, చెమటలు పట్టడం వంటి సమస్యలతో బాధపడుతుండగా.. చాలా మందిలో పొట్టకు సంబంధించిన కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది రోగులు వాంతులు, తలనొప్పి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. చర్మంపై కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. చాలామందికి ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయి. డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ లక్షణాలు కాస్త తక్కువగానే ఉన్నాయని చెబుతున్నప్పటికీ, వ్యాధి సోకిన వారి సంఖ్య పెరుగుతుండడంతో కొత్త లక్షణాలు గుర్తిస్తున్నారు.

అధ్యయనాల ప్రకారం.. ఓమిక్రాన్ లక్షణాలు డెల్టా వేరియంట్ కంటే తక్కువగా ఉన్నాయని తేలింది. అయితే, వ్యాధి సోకిన ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ చేసిన పరిశోధన ప్రకారం, ఓమిక్రాన్ సోకిన రోగులలో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 15నుంచి 25శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

చలికాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణం కాగా.. ఒమిక్రాన్ లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయని, ఈ రెండింటి లక్షణాల మధ్య తేడా ఏమిటో అర్థం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. ఫ్లూ సీజన్‌లో, జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు కండరాల నొప్పులు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.