Indian Army : ఈ ఏడాది 182 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

సరిహద్దులో భారత సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. దేశంలోకి చొరబడి హింసకు పాల్పడాలని చూస్తున్న ఉగ్రవాదులను సరిహద్దుల్లోని మట్టుబెడుతున్నాయి భారత బలగాలు.

Indian Army : ఈ ఏడాది 182 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

Indian Army

Indian Army : సరిహద్దులో భారత సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. దేశంలోకి చొరబడి హింసకు పాల్పడాలని చూస్తున్న ఉగ్రవాదులను సరిహద్దుల్లోని మట్టుబెడుతున్నాయి భారత బలగాలు. ఉగ్రవాద ఏరివేతలో భాగంగా ఈ ఏడాది 100పైగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాయి బలగాలు. ఈ ఆపరేషన్లలో 182 మంది ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. వీరిలో 44 మంది టాప్ టెర్రరిస్టులు ఉన్నట్లుగా వివరించారు.

చదవండి : Encounter : శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

శుక్రవారం మీడియాతో మాట్లాడిన దిల్బాగ్ సింగ్ ఈ ఏడాది సైన్యం, కశ్మీర్ పోలీసులు కలిసి చేసిన సెర్చ్ ఆపరేషన్ల గురించి వివరించారు. ఉగ్రపోరులో భారత సైన్యం ఏ మాత్రం వెనుకడుగు వేసేది లేదని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఉగ్రవాదులతో పోరాడుతూ 44 మంది భారత సైనికులు వీరమరణం పొందినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఉగ్రవాదులతో పోరులో 56 మంది సైనికులు మృతి చెందారు.

చదవండి : Encounter : అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

కాగా డిసెంబర్ నెలలో భారత సైన్యం చేతిలో 20 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ లోయలో తరచుగా ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇక బుధ, గురు, శుక్రవారాల్లో జరిగిన కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు మరణించగా.. 5 సైనికులు గాయాలపాలయ్యారు.