Bangalore Airport : బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

గంట పాటు ఎయిర్ పోర్టు పరిసరాలు, టెర్మినల్ బిల్డింగ్స్ తో పాటు అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు.

Bangalore Airport : బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

Bangalore

Bangalore Airport : బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టారంటూ అగంతకుడు ఫోన్ కాల్ చేసి చెప్పాడు. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు, సీఐఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తో ఎయిర్ పోర్టులో తనిఖీలు చేశారు. ప్రయాణికులను కూడా తనిఖీలు చేసిన తర్వాత అది ఫేక్ కాల్ గా పోలీసులు నిర్ధారించారు.

దీంతో ప్రయాణికులతో పాటు అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు కంట్రోల్ రూమ్ కు శుక్రవారం తెల్లవారుజామున 3.50 గంటలకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Bomb Threat : బెంగళూరులో ఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్

గంట పాటు ఎయిర్ పోర్టు పరిసరాలు, టెర్మినల్ బిల్డింగ్స్ తో పాటు అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.