MP Asaduddin Owaisi : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిపిన దుండగుడు అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు.

MP Asaduddin Owaisi : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిపిన దుండగుడు అరెస్టు

Asaduddin

The assailant has been arrested : యూపీలోని మీరట్ లో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులు జరుపుతుండగా కారుతో ఢీకొట్టగా దుండగుడు కింద పడ్డాడు. దీంతో వెంటనే ఆ దుండగుడిని పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో టోల్ ప్లాజా దగ్గర అతనిపై దుండగులు కాల్పులు జరిపారు. కారు డోర్ లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ, ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల కారణంగా ఓవైసీ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరో వాహనంలో అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ బయల్దేరారు.

Asaduddin Owaisi: ఢిల్లీ చేరిన ఒవైసి.. ‘స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా’

దాడి అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై ముగ్గురు వ్యక్తులు దాడికి యత్నించారని, వారిలో ఇద్దరు బుల్లెట్లు పేల్చారని ఒవైసీ చెప్పారు. అంతకుముందు మీరట్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ కంటే ఎస్పీ, బీఎస్పీ తక్కువేమీ కాదని ఒవైసీ అన్నారు. ఎంతకాలం ఈ పార్టీల కోసం ముస్లింలు త్యాగాలు చేయాలని ప్రశ్నించారు.

అసదుద్దీన్ ఓవైసీ..
మీరట్, కిఠౌర్ ప్రాంతాల్లో ఈ రోజు పాదయాత్ర చేశాం. కార్యక్రమాలు ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యాను. నా కారుకు ముందు ఒక సఫారీ, వెనుకాల రెండు ఫార్చ్యూనర్ వాహనాలున్నాయి. ఛజార్సీ టోల్ ప్లాజ్ దగ్గరికి రాగానే బ్యారికేడ్ల కారణంగా మా వాహనాలు స్లో అయ్యాయి. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. మా డ్రైవర్ కాల్పులు జరుగుతున్నాయని గ్రహించాడు. వెంటనే మా ముందున్న వాహనాన్ని ఢీకొడుతూ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు

మా కారు ఎడమ వైపు రెండు బుల్లెట్ గుర్తులు ఉన్నాయి. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిగినట్టు అర్థమైంది. కాల్పులు జరిపినవారిలో ఒకరు ఎరుపు జాకెట్, ఒకరు తెలుపు జాకెట్ ధరించి ఉన్నారు. మా వెనకాల ఉన్న ఫార్చ్యూనర్‌లో ఉన్నవాళ్లు దుండగులపైకి వాహనాన్ని తీసుకెళ్లారు. అందులో ఒకరి కాలుపై నుంచి ఫార్చ్యూనర్ వెళ్లింది. తెలుపు జాకెట్లో ఉన్న వ్యక్తి అక్కణ్ణుంచి పారిపోయాడు.

కాసేపటి తర్వాత అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి ఫోన్ చేశాడు. కాల్పులకు పాల్పడినవారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరగడం వెనుక కచ్చితంగా రాజకీయ కారణాలున్నాయి అని అసదుద్దీన్ పేర్కొన్నారు.