Shocking Video: గుంతను తప్పించబోయి లారీ కిందకు దూసుకెళ్లిన బైక్.. వాహనదారుడు మృతి.. వీడియో వైరల్

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆదివారం రోడ్డుపై గుంతల కారణంగా 22ఏళ్ల వ్యక్తి మరణించాడు.దివా-అగాసన్ రోడ్డులో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Shocking Video: గుంతను తప్పించబోయి లారీ కిందకు దూసుకెళ్లిన బైక్.. వాహనదారుడు మృతి.. వీడియో వైరల్

Road accident

Shocking Video: వాహనంతో రోడ్డుపైకి వచ్చామంటే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాలి. అదీ రాత్రివేళలో అయితే.. రోడ్డుపై ఎక్కడ ఏ గుంత ఉంటుందో కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు చూసుకోకుండా వెళ్లి ప్రమాదాల భారిన పడుతుంటారు. ఇలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. గుంతల కారణంగా ద్విచక్ర వాహనం బ్యాలెన్స్ తప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. లారీ వాహనదారుడిపైకి ఎక్కడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ghulam Nabi Azad: రాహుల్ గాంధీ మంచివ్యక్తే.. కానీ, రాజకీయాల్లో కొనసాగే యోగ్యత లేదు: గులాం నబీ ఆజాద్

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆదివారం రోడ్డుపై గుంతల కారణంగా 22ఏళ్ల వ్యక్తి మరణించాడు.దివా-అగాసన్ రోడ్డులో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యాయి. తన మోటార్‌సైకిల్‌పై గణేష్ ఫాలే అనే వ్యక్తి దివా – అగాసన్ రోడ్డుపై వెళ్తున్నాడు. రోడ్డుపై గుంతలు ఉండటం, అదీ రాత్రి సమయం కావటంతో నెమ్మదిగా వెళ్తున్నాడు. ఇదే సమయంలో లారీ ఎదురుగా రావడంతో బైక్ ను పోనిచ్చే క్రమంలో రోడ్డుపై గుంత కారణంగా వాహనం అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. గణేష్ ఫాలే లారీ వెనుక చక్రాల కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ అకస్మాత్తు ఘటనతో కంగుతిన్న స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించాడు. తీవ్రగాయాలు కావడంతో అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Old Mobiles: విచిత్ర పరిణామం.. 5జీ వైపు పరుగులు పెడుతుంటే.. పాత తరం ఫోన్‌లకు పెరిగిన గిరాకీ.. సోషల్ మీడియానే కారణమా?

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఎమ్మెల్యే రాజు పాటిల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పోస్టును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ట్యాగ్ చేశాడు. రోడ్‌ వర్క్‌లు కేవలం కాగితాలపై మాత్రమే ప్రకటించారు. కానీ వాస్తవానికి జరగడం లేదంటూ ఆరోపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు స్థానిక పాలకవర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ రీ ట్వీట్లు చేస్తున్నారు.