Karnataka: ఎన్నికలలోపు మాజీ సీఎం జైలుకు వెళ్తారంటూ హెచ్చరించిన బీజేపీ చీఫ్
ఇక నళిన్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కేంద్ర సంస్థల్ని బీజేపీ ఇష్టారీతిన ఉపయోగిస్తుందని చెప్పడానికి ఇది మరొక ఉదాహారణ అని పేర్కొంది. తప్పుడు కేసులు పెట్టి తమను జైలుకు పంపేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోందని, విపక్షాలను అణచివేసేందుకు బీజేపీకి ఇది ఆయుధంగా దొరికిందని విమర్శించింది.

The BJP chief warned that the former CM would go to jail before the elections
Karnataka: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జైలుకు వెళ్తారని ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ నళిన్ కుమార్ కటిలు హెచ్చరించారు. సిద్ధరామయ్య హయాంలో ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని, అవన్నీ ప్రస్తుతం బయటికి వస్తున్నాయని ఆయన అన్నారు. సోమవారం మంగళూరులో దక్షిణకన్నడ జిల్లా బూత్ స్థాయి విజయ అభియానలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Supreme Court: ప్రజాప్రతినిధుల భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు? సుప్రీం సంచలన వ్యాఖ్యలు
‘‘సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవకతవకలు జరిగాయి. అప్పటి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. అవన్నీ ప్రస్తుతం బయటికి వస్తున్నాయి. మాజీ సీఎం సిద్దరామయ్య ఎన్నికలకు ముందే జైలుకు వెళ్తారు’’ అని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో జేడీఎస్ ప్రభావంపై ఆయన స్పందిస్తూ.. రాష్ట్ర రాజకీయాల్లో జేడీఎస్ కొన్ని ప్రాంతాలకే పరిమితమన్నారు.
Bill from 1987: కిలో గోధుమలు రూ.1.6 మాత్రమే.. ఫొటో వైరల్
ఇక నళిన్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కేంద్ర సంస్థల్ని బీజేపీ ఇష్టారీతిన ఉపయోగిస్తుందని చెప్పడానికి ఇది మరొక ఉదాహారణ అని పేర్కొంది. తప్పుడు కేసులు పెట్టి తమను జైలుకు పంపేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోందని, విపక్షాలను అణచివేసేందుకు బీజేపీకి ఇది ఆయుధంగా దొరికిందని విమర్శించింది.
Imran Khan: అవును, నేను ప్లే బాయ్నే. అయితే ఏంటట?.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు