Madhyapradesh: ప్రియురాలిపై దాడిచేసిన ప్రియుడు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్.. ఇంటిని కూల్చివేత..

మధ్యప్రదేశ్‌లో ప్రియురాలు పెళ్లిచేసుకోమని అడిగినందుకు ప్రియుడు రోడ్డుపైనే చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం విధితమే. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రియుడిని అరెస్టు చేయడంతో పాటు, అతని ఇల్లు అక్రమ నిర్మాణం అని గుర్తించి బుల్డోజర్‌తో అధికారులు కూల్చివేశారు.

Madhyapradesh: ప్రియురాలిపై దాడిచేసిన ప్రియుడు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్.. ఇంటిని కూల్చివేత..

Madhyapradesh

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో ప్రియురాలు పెళ్లిచేసుకోమని అడిగినందుకు ప్రియుడు రోడ్డుపైనే చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం విధితమే. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రియుడిని అరెస్టు చేయడంతో పాటు, అతని ఇల్లు అక్రమ నిర్మాణం అని గుర్తించి బుల్డోజర్ తో అధికారులు కూల్చివేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం శివరాజ్ చౌహాన్ నేరుగా తన ట్విటర్ అధికారిక ఖాతాలో పోస్టు చేశారు. అంతేకాదు.. మధ్యప్రదేశ్ గడ్డపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారెవరిని విడిచిపెట్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ ప్రాంతం ధేరా గ్రామంకు చెందిన పంకజ్ త్రిపాఠి, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి మధ్య కొద్దికాలంగా ప్రేమ వ్యవహారం సాగుతుంది. తాజాగా, నన్ను పెళ్లిచేసుకోమని త్రిపాఠిని యువతి కోరగా.. అతడు ఆమెను రోడ్డుపై పడేసి తీవ్రంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు.

 

ఈఘటనపై ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై సీఎం చౌహాన్ కార్యాలయంకూడా ఓ వీడియోను ట్వీట్ చేసింది. పంకజ్ త్రిపాఠి ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేసినట్లు తెలిపింది. అక్రమంగా నిర్మాణం చేయడం వల్ల ఈ ఇంటిని కూల్చివేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై రేవా ఎస్డీఓపీ నవీన్ త్రివారీ మాట్లాడుతూ.. పంకజ్ త్రిపాఠిపై చర్యలు తీసుకోవటం జరిగిందని, తీవ్రగా గాయపడ్డ యువతిని ఆస్పత్రిలో చికిత్స అందించటం జరుగుతుందని తెలిపారు.