Gift : పెళ్లి గిఫ్ట్‌ చూసి షాకైన వధువు

ఇటీవల పెళ్లిళ్లలో జరుగుతున్న ఘటనలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొన్ని వీడియోలు వధువుకు సంబంధించినవి, మరికొన్ని వరుడుకు సంబంధించినవి, ఇంకొన్ని వధూవరులవి ఉంటున్నాయి.

Gift : పెళ్లి గిఫ్ట్‌ చూసి షాకైన వధువు

Gift

bride shocked to see gift : ఇటీవల పెళ్లిళ్లలో జరుగుతున్న ఘటనలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొన్ని వీడియోలు వధువుకు సంబంధించినవి ఉండగా, మరికొన్ని వరుడుకు సంబంధించినవి, ఇంకొన్ని సందర్భాల్లో వధూవరులు ఇద్దరివీ ఉంటున్నాయి. ఆ మంటపంలో ఎవరో ఒకరు ఆ వేడుకలను వీడియో తీసి అందరికీ షేర్ చేస్తున్నారు.

అందులో కొన్ని నెట్టింట దర్శనమిస్తూ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక ఈ రోజుల్లో వధూవరులను బంధువులు, స్నేహితులు ఆటపట్టించడం షరా మామూలు అయింది. తాజాగా ఈ వీడియోలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Google : గూగుల్ లో 2/3 మోడల్ పని దినాలు

అందులో వధువు, వరుడు వేదికపై కూర్చొని ఉన్నారు. వివాహానికి విచ్చేసిన అతిథిలు.. కొత్త జంటకు విషెస్ చెబుతూ బహుమతులను ఇస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం అందరి ముందే ఓపెన్ చెయ్యాలని వధువుని కోరారు. అందులో ఏదో ప్రత్యేకమైన వస్తువు ఉంటుందని అందరూ ఆసక్తిగా చూశారు.

తీరా వధువు ఆ గిఫ్ట్‌ బాక్సును ఓపెన్ చేసి చూడగా, అందులో చపాతీ కర్రను ఉండడంతో ఓ వైపు షాక్‌కు గురి కాగా, మరో వైపు నవ్వింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.