పద్మ అవార్డు గ్రహీతలు వీరే

పద్మ అవార్డు గ్రహీతలు వీరే

prestigious Padma Awards : దేశంలోనే అత్యున్నత పురస్కారాలిచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రతిష్మాత్మకమైన పద్మ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం,.. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా.. పలువురు ప్రముఖులను అవార్డులతో సత్కరించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. దేశ అత్యున్నతమైన రెండో పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు.. ఈసారి మొత్తం వివిధ రంగాల్లో ఏడుగురికి దక్కింది.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు విదేశీ కోటాలో అందచేయగా.. దివంగత దిగ్గజ సింగర్ ఎస్పీ బాలుకు, కర్నాటకకు చెందిన డాక్టర్ బెల్లే మోనప్ప హెగ్డే, అమెరికాకు చెందిన నరీందర్ సింగ్ కపానీ, ఢిల్లీకి చెందిన మౌలానా వహీదుద్దీన్ ఖాన్, బి.బి.లాల్, ఒడిశాకు చెందిన సుదర్శన్ సాహూకు అవార్డులు.

ఇక దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డు ఈ ఏడాది 10 మందికి ప్రకటించింది కేంద్రం. కేరళకు చెందిన క్రిష్నన్ నాయన్ శాంతకుమారి, అసోంకు చెందిన మాజీ సీఎం తరుణ్ గొగోయ్, కర్నాటకకు చెందిన చంద్రశేఖర్ కంబారా, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అవార్డులు దక్కాయి.

వీరితో పాటు యూపీకి చెందిన నృపేంద్ర మిశ్రా, మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, గుజరాత్ మాజీ సీఎం కేశూ భాయ్ పటేల్, యూపీకి చెందిన కల్బే సాదిఖ్, మహారాష్ట్రకు చెందిన రజనికాంత్ దేవదాస్ ష్రాఫ్, హర్యానాకు చెందిన తర్లోచన్ సింగ్‌కు
అవార్డులు దక్కాయి.

పద్మశ్రీ అవార్డులను ఈసారి మొత్తం 102 మందికి ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్నవరపు రామస్వామి, ప్రకాశ్‌రావు ఆశావాది, నిడుమోలు సుమతికి అవార్డు దక్కింది. తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చెందిన గుస్సాడీ నృత్యకారుడు కనకరాజుకు ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ అవార్డు లభించింది.

స్పోర్ట్స్ విభాగంలో ఈసారి ఏడుగురికి పద్మ అవార్డులు దక్కాయి. తమిళనాడుకు చెందిన క్రీడాకారిణి అనితకు అవార్డు లభించగా.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన మోనాదాస్‌ కూడా పద్మ అవార్డుల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అంశూ జన్‌సేన్పా, కేరళకు చెందిన మాధవన్ నంబేర్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుధా హరి నారాయణ్ సింగ్, హర్యానాకు చెందిన వీరేందర్ సింగ్‌కు అవార్డు లభించింది.

కర్నాటకకు చెందిన వెంకటేష్‌ కూడా పద్మ అవార్డు లిస్ట్‌లో చోటు లభించింది. మొత్తంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం విశిష్ట పురస్కారాతో సత్కరించింది.