ఫాస్టాగ్ గడువును మరోసారి పొడిగించిన కేంద్రం…టోల్ ప్లాజాల్లో క్యాష్‌ లెస్‌ ట్రాన్సాక్షన్స్

ఫాస్టాగ్ గడువును మరోసారి పొడిగించిన కేంద్రం…టోల్ ప్లాజాల్లో క్యాష్‌ లెస్‌ ట్రాన్సాక్షన్స్

extended the Fastag deadline : ఫాస్టాగ్‌ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి15 వరకు ఫాస్టాగ్‌ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి టోల్ ప్లాజాలలో కేవలం క్యాష్‌ లెస్‌ ట్రాన్సాక్షన్‌లను చేయాలని నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా మార్పులు కూడా చేసింది. కానీ దేశవ్యాప్తంగా ఇంకా అనేక మంది వాహనదారులు టోల్‌ ప్లాజాల వద్ద నగదును మాత్రమే చెల్లిస్తుండటం.. ఫాస్టాగ్‌ తీసుకోకపోవడంతో.. ఈ గడువును మరోసారి పొడిగించింది.

టోల్ ప్లాజాల వద్ద జనవరి 1 నుంచి క్యాష్‌ లైన్లను తొలగించి … అన్ని ఫాస్టాగ్‌ లైన్లను మాత్రమే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఫాస్టాగ్‌ లేని వారికి ప్రిపేయిడ్ కార్డ్‌లను జారీ చేయాలని నిర్ణయించింది. టోల్ ప్లాజాల వద్ద వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోకుండా ఉండేందుకు ప్రిపేయిడ్‌ టచ్‌ అండ్‌ గో విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రీ పెయిడ్ కార్డు విధానాన్ని పెడితే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చని భావించింది. ఫాస్టాగ్ లేకపోతే పెనాల్టీగా రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సిందేనని నిర్ణయించింది. అయితే ఇంకా చాలా మంది ఫాస్టాగ్‌ తీసుకోకుండా నగదు చెల్లిస్తున్నారన్న విషయాన్ని గమనించిన కేంద్రం.. ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.