అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు లేవు

  • Published By: bheemraj ,Published On : August 22, 2020 / 10:45 PM IST
అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు లేవు

అంతర రాష్ట్ర రవాణాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. కరోనా కారణంగా అంతర రాష్ట్ర రవాణా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆంక్షలు ఎత్తివేశారు.

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జులై 30 తేదీన విడుదల చేసిన మార్గదర్శకాల్లోనే రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఒక రాష్ట్రం నుంచి వచ్చే వారికి మరో రాష్ట్రం వారు ఆంక్షలు విధించవద్దని చెప్పి గైడ్ లైన్స్ లోనే పేర్కొన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల ముఖ్యంగా అంతర రాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధించడంతో కేంద్రం హోం శాఖ కార్యదర్శి అజయ్ భళ్లా అన్ని రాష్ట్రాల కార్యదర్శులకి లేఖ రాశారు.

అంతర రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని చెప్పి ముఖ్యంగా ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ ఆంక్షల వల్ల ఆర్థిక కార్యకలాపాలు, అలాగే ఉపాధి కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని హోంశాఖ కార్యదర్శి రాష్ట్రాల కార్యదర్శులకి చెప్పారు. ఇకపై ఏ రాష్ట్రంపై వెళ్ళే వారు కూడా ఆంక్షలు విధించపోవద్దని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది.