Bar Codes On Medicines : నకిలీ మందులకు అడ్డుకట్ట.. ఔషధాలపై బార్ కోడ్ తప్పనిసరి

దేశంలో నకిలీ మందులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ మందుల సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధాలపై బార్ కోడ్ తప్పనిసరి చేసింది.

Bar Codes On Medicines : నకిలీ మందులకు అడ్డుకట్ట.. ఔషధాలపై బార్ కోడ్ తప్పనిసరి

bar codes on medicines

Bar Codes On Medicines : దేశంలో నకిలీ మందులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ మందుల సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధాలపై బార్ కోడ్ తప్పనిసరి చేసింది. దీంతో 300 డ్రగ్ ఫార్ములేషన్స్ పై కంపెనీలు బార్ కోడ్ ను కచ్చితంగా ముద్రించాల్సి ఉంటుంది. ఇది 2023 ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

Aurobindo Pharma Recalled : అమెరికా నుంచి అరబిందో ఔషధాలు రికాల్‌.. ప్రకటించిన యూఎస్‌ఎఫ్‌డీఏ

దీన్ని మెడిసిన్స్ ఆధార్ కార్డుగా పరిగణిస్తున్నారు. ఈ బార్ కోడ్ లో మాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్స్, చిరునామా, తేదీ, బ్యాచ్ నంబర్, డ్రగ్ జనరిక్ పేరు, కంపెనీ పేరు, గడుపు తేదీ వంటి వివరాలను కంపెనీలు పొందుపర్చాల్సి ఉంటుంది. వీటిలో అధికంగా అమ్ముడుపోయే అల్లెగ్రా, డోలో, అగ్మెంటిన్, సారిడాన్, కాల్ పోల్, థైరోనార్మ్ వంటి ఔషధాలు కూడా ఉన్నాయి.