Central Govt : డిజిటల్‌ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తిపై కేంద్రం కఠిన చర్యలు

దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ప్రసారమాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ... కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

Central Govt : డిజిటల్‌ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తిపై కేంద్రం కఠిన చర్యలు

Fake News

central government : సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా నకిలీ వార్తల కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లను నిషేధించిన కేంద్రం… ఇప్పుడు మరికొన్ని సోషల్‌ మీడియా ఖాతాలు, యూట్యూబ్‌ ఛానెల్స్‌పై చర్యలు తీసుకుంది. 2012-22 మధ్య కాలంలో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్‌ ఛానెళ్లు, 19 సోషల్‌ మీడియా ఖాతాలు, 747 URLలపై నిషేధం విధించినట్లు వెల్లడించింది.

దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ప్రసారమాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు … కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

YouTube: అబార్ష‌న్లు చేసే ప్ర‌క్రియ‌పై త‌ప్పుడు స‌మాచారంతో వీడియోలు.. యూట్యూబ్ చ‌ర్య‌లు

డిజిటల్‌ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తి కట్టడికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌ – 2020 కింద… గతేడాది ఫిబ్రవరి 25న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌ 2021ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. దీని ప్రకారం ఏదైనా యూట్యూబ్‌ ఛానెల్‌, సోషల్‌ మీడియా ఖాతా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, కోడ్‌లు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే…. చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.

అలానే నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆధ్యర్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2009 నవంబర్‌లో నిజనిర్ధారణ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.