Cooking Oils : వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు

కోటా దాటి దిగుమతి చేసుకునే ముడి నూనెపై సాధారణ పన్ను వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Cooking Oils : వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు

Cooking Oil (1)

cooking oils prices : దేశంలో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2022-24 ఆర్ధిక సంవత్సరాల్లో నూనెల దిగుమతిపై పన్ను విధించబోమని కేంద్రం ప్రకటించింది. 20 లక్షల మెట్రిక్ టన్నుల ముడి సన్ ఫ్లవర్, సోయాబీన్ నూనెపై పన్ను విధించబోమని స్పష్టం చేసింది. 20 లక్షల మెట్రిక్ టన్నులను టారిఫ్ రేటు కోటా కింద ఆర్ధిక శాఖ పేర్కొంది.

కోటా దాటి దిగుమతి చేసుకునే ముడి నూనెపై సాధారణ పన్ను వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో చక్కెర లభ్యత పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. జూన్1 నుంచి చక్కెర ఎగుమతులపై పరిమితి విధిస్తున్నట్లు డీజీఎఫ్టీ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు చక్కెర ఎగుమతులపై పరిమితి కొనసాగుతుందని వెల్లడించింది.

Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు

ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్ మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థికశాఖ మంగళవారం(మే24,2022) పేర్కొంది. ఈ నిర్ణయంతో వంటనూనెల ధరలు తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వస్తుందని భావిస్తోంది.