Central Govt : ఇంధన కొరతకు చెక్‌..రంగంలోకి దిగిన కేంద్రం

పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తుండడంతో కేంద్రం రంగంలోకి దిగింది. యూనివర్సిల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ పరిధిని విస్తరించింది. దీని ప్రకారం చమురు విక్రయానికి లైసెన్స్‌ పొందిన కంపెనీలు గ్రామీణ ప్రాంతాలు సహా అన్ని బంకుల్లో నిర్ధేశించిన సమయాల్లో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది.

Central Govt : ఇంధన కొరతకు చెక్‌..రంగంలోకి దిగిన కేంద్రం

Fuel Shortage

central government : దేశంలో నెలకొన్న ఇంధన కష్టాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత కొద్ది రోజులుగా దేశంలోని చాలా రాష్ట్రాల్లోని పెట్రోల్‌ బంక్‌ల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌తోపాటు ఏపీలోని కొన్నిచోట్ల ఈ పరిస్థితి నెలకొంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంక్‌లకు వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చమురు విక్రయాలు గిట్టుబాటు కాకపోవడంతో ప్రైవేట్‌ కంపెనీలు విక్రయాలు నిలిపివేయడమే ఇంధన కొరతకు కారణం. దీంతో ప్రభుత్వరంగ పెట్రోల్‌ బంకులపై ఒత్తిడి పడి నో స్టాక్‌ బోర్డులు వెలుస్తున్నాయి

పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తుండడంతో కేంద్రం రంగంలోకి దిగింది. యూనివర్సిల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ పరిధిని విస్తరించింది. దీని ప్రకారం చమురు విక్రయానికి లైసెన్స్‌ పొందిన కంపెనీలు గ్రామీణ ప్రాంతాలు సహా అన్ని బంకుల్లో నిర్ధేశించిన సమయాల్లో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది. మూరుమూల ప్రాంతాలకు సైతం యూఎస్‌వోను విస్తరింపజేస్తున్నట్టు అన్ని రిటైల్‌ ఔట్‌లెట్లకు ఈ కండిషన్‌ వర్తిస్తుందని చమురు మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది.

Sri Lanka Crisis : పెట్రోల్ కోసం రోజంతా క్యూలైన్ లోనే…గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి

ఇటీవల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా ప్రభుత్వ రంగ కంపెనీలైన ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌, డీజిల్‌ను 15 నుంచి 25 రూపాయలు తక్కువకే విక్రయిస్తున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని రేట్లను పెంచడం లేదు. ఏప్రిల్‌ 6 నుంచి చమురు ధరలు మారకపోవడానికి కారణమిదే.

అదే సమయంలో జియో-బీపీ, నైరా ఎనర్జీ వంటి కంపెనీలు కొన్ని చోట్ల ఎక్కువ ధరకు విక్రయించడమో.. లేదంటే.. విక్రయాలు నిలిపివేయడమో చేస్తున్నాయి. దీంతో ప్రైవేటు రంగ పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ ధరలు ఎక్కువ ఉండడమో, స్టాక్‌ లేదన్న బోర్డులు కనిపించడంతో ప్రజలు ప్రభుత్వ రంగ పెట్రోల్‌ పంపుల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.