Central Govt Letter : మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు..7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

కోవిడ్‌ కేసులు పలు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతుండడంతో కేంద ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాలకు లేఖలు రాసింది. వ్యాక్సినేషన్, టెస్టింగ్, కోవిడ్ నిబంధనలను పునరుద్ధరించడం లాంటి చర్యలు తీసుకోవాలని సూచించింది.

Central Govt Letter : మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు..7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

central govt letter states

Central Govt Letter : కోవిడ్‌ కేసులు పలు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతుండడంతో కేంద ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాలకు లేఖలు రాసింది. వ్యాక్సినేషన్, టెస్టింగ్, కోవిడ్ నిబంధనలను పునరుద్ధరించడం లాంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. రాబోయేది పండుగల సీజన్ కావడంతో పెద్ద సంఖ్యలో జనం ఒకచోట చోటే అవకాశముందని… ప్రజలు కూడా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణాలు సాగిస్తుంటారని, తద్వారా కోవిడ్ సహా పలు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలుంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తన లేఖలో హెచ్చరించింది.

కేసులు పెరుగుదల విషయంలో ఏ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి, పాజిటివిటీ రేటు ఎలా ఉందనే విషయంపై నిఘా ఉంచాలని సూచించింది కేంద్రం. ఇన్‌ఫెక్షన్ విస్తరించకుండా క్లస్టర్లు ఏర్పాటు చేయడం, సమర్ధవంతమైన నిర్వహణా చర్యలు చేపట్టడం చేయాలని ఆదేశించింది. ఇన్‌ఫెక్షన్ త్వరితగతిన విస్తరించకుండా ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ తన లేఖలో కోరింది. రాష్ట్రాలన్నీ ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని సూచించింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్-కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్‌ను కచ్చితంగా పాటించాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ కోరింది.

Telangana Corona News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే

దేశంలో కొత్తగా 18,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారంతో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య శనివారం స్వల్పంగా తగ్గింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,40,78,506కు చేరింది. ఇందులో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,34,933 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 40 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. నిన్న 18,558 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదయిందని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.50 శాతం, యాక్టివ్ కేసులు 0.31 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 205.21 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర్ర ప్రభుత్వం పేర్కొంది.