ప్రైవేటీకరణ దిశగా కేంద్రం దూకుడు : 5 లక్షల కోట్ల విలువైన 100కిపైగా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుపరం

ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా... ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆస్తుల ఉపసంహరణ విషయంలో కేంద్రం అదే దూకుడు ప్రదర్శిస్తోంది... ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రైవేట్‌ను ప్రోత్సహించడం ఒక్కటే మార్గమని నమ్ముతున్న కేంద్రం... ఆ దిశగా..వేగంగా అడుగులు వేస్తోంది...

ప్రైవేటీకరణ దిశగా కేంద్రం దూకుడు : 5 లక్షల కోట్ల విలువైన 100కిపైగా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుపరం

100 government assets privatize : ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా… ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆస్తుల ఉపసంహరణ విషయంలో కేంద్రం అదే దూకుడు ప్రదర్శిస్తోంది… ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రైవేట్‌ను ప్రోత్సహించడం ఒక్కటే మార్గమని నమ్ముతున్న కేంద్రం… ఆ దిశగా..వేగంగా అడుగులు వేస్తోంది… ఆస్తులను గుర్తించడం… వాటిని ఎప్పటిలోగా అమ్మాలో టార్గెట్‌గా పెట్టుకోవడం… ఇలాంటి పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా…100కి పైగా ఆస్తులు… గుర్తించినట్టు సమాచారం.. వీటి విలువ దాదాపు ఐదు లక్షల కోట్ల వరకూ ఉంటుంది…

ప్రైవేటీకరణ దిశగా కేంద్రం దూకుడు పెంచింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వంద ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మకానికి పెట్టెందుకు ప్రణాళికలు రచిస్తోంది. వీటి విలువ అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ప్రభుత్వ అధీనంలోని ఇంధన సంస్థలు, స్పోర్ట్స్‌ స్టేడియాలు, రైల్వే, టెలికామ్‌ లాంటి వివిధ సంస్థలను ప్రైవేటుపరం చేయలని మోదీ సర్కార్‌ భావిస్తోంది. దీనికి సంబంధించిన లిస్ట్‌ను కేంద్రం ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపింది కూడా. జాబితాలోని సంస్థలకు రోడ్‌ మ్యాప్‌ కూడా సిద్ధం చేయాలని నీతి ఆయోగ్‌ ఆదేశాలు జారీ చేసింది.

వచ్చే నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఏఏ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చే వాటిని గుర్తించి.. ప్రైవేటీకరణకు ఏర్పాట్లు చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలను నీతి ఆయోగ్ కోరింది. ఎప్పుడెప్పుడు ఏ కంపెనీని ప్రైవేటుపరం చేయాలి.. ఎంతకు అమ్మాలి అనే దానిపై షెడ్యూల్‌ తయారు చేసే పనిలో ఉంది కేంద్రం. 2022 ఆర్థిక సంవత్సరానికి లక్ష 75 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్‌ తరహాలోనే ఆ ఏడాదిలోనే మరిన్ని సంస్థలు ప్రైవేటుపరమవ్వడం ఖాయంగా తెలుస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 21 వేల కోట్ల టార్గెట్‌ను మాత్రమే చేరుకోవడంతో.. ప్రైవేటీకరణ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది.

వ్యాపారం చేయడం ప్రభుత్వ వ్యవహారం కాదని ఇటివలే ప్రధాని మోదీ చెప్పారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నడపాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ రంగాల ఆస్తులను మానిటైజ్‌ చేస్తూ యువతకు ప్రోత్సాహం ఇచ్చేలా ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేయాలని ప్రకటించారు కూడా. మోదీ చెప్పింది చెప్పినట్లు వచ్చే నాలుగేళ్లలో జరిగే అవకాశాలు వంద శాతం కనిపిస్తున్నాయి. కేంద్ర విధానాలతో ప్రయివేటీకరణ ఆలోచన వెనుక అసలు రహస్యం తెలుస్తోంది.

మానెటైజేషన్‌ ఆఫ్‌ అస్సెట్స్‌ ఐడియాతో కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది. మానిటైజేషన్‌ అంటే స్థిరాస్థులను నగదులోకి మార్చుకోవడం. దశాబ్దాలుగా ప్రభుత్వరంగం పోగేసి కాపాడుతున్న ఆస్థులన్నింటినీ అమ్ముకోవడం. ఇప్పుడు ఈ ఫార్ములాతో కేంద్రం దేశంలోని ప్రధాన సంస్థలన్నిటిని ప్రైవేటకు కట్టబెట్టనుంది.