Central Government : కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వానిదే : కేంద్రం
కాళేశ్వరంప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరుల ద్వారా నిర్మించిందని పేర్కొంది. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని తెలిపింది.

Kaleshwaram
cost of the Kaleswaram project : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది. కాళేశ్వరం నిర్మాణానికి కేంద్ర జలశక్తి శాఖ సలహా మండలి అనుమతి ఉందని తెలిపింది.
కాళేశ్వరంప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరుల ద్వారా నిర్మించిందని పేర్కొంది. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని తెలిపింది. ప్రాజెక్టు ద్వారా కొత్తగా 18,25,700 ఎకరాలకు సాగునీరు అందనుందని వెల్లడించింది.
MLA Etala Rajender : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తా : ఎమ్మెల్యే ఈటల
కాళేశ్వరం ద్వారా మరో 18,82,970 ఎకరాల స్థిరీకరణ జరుగుతుందని పేర్కొంది. 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సరఫరా చేయాలని ప్రాజెక్టు ఉద్దేశమని తెలిపింది.