జేఈఈ మెయిన్స్ 2021 ప్రవేశ పరీక్ష మరిన్ని ప్రాంతీయ భాషాల్లోనన కేంద్ర మంత్రి ట్వీట్…

  • Published By: Chandu 10tv ,Published On : October 23, 2020 / 11:50 AM IST
జేఈఈ మెయిన్స్ 2021 ప్రవేశ పరీక్ష మరిన్ని ప్రాంతీయ భాషాల్లోనన కేంద్ర మంత్రి ట్వీట్…

JEE mains 2021:  జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం ఒక శుభవార్త.. చెప్పింది. త్వరలోనే మెయిన్స్ పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషాల్లో రాసేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (JAB) నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి దేశంలోని మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ప్రకటించారు.


మాతృభాష, ప్రాంతీయ భాషలను ప్రోత్సాహించేందుకు గాను నూతన జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు. అభ్యర్దులు వచ్చే ఏడాది నుంచి మరిన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్షలకు హాజరు కావచ్చునని ఆయన పేర్కొన్నారు.



https://10tv.in/teacher-killed-in-france/
ఈ పరీక్షను ఏయే భాషల్లో నిర్వహిస్తారనేది, వాటి సంఖ్య గురించి మాత్రం ఎటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. ఇక స్టేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రెన్స్‌ పరీక్ష ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని మంత్రి రమేశ్ తెలియజేశారు.


జేఈఈ మెయిన్‌ ఆధారంగా విద్యార్థులను కాలేజీల్లోకి చేర్చుకునే రాష్ట్రాల స్టేట్‌ లాంగ్వేజ్‌ను కూడా ఇందులో చేర్చనున్నట్లు తెలిపారు. ‘దూరదృష్టి’ కలిగి ఉన్నందున ఈ చర్య ఎంతో లాభాదాయకంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులకు లభ్ధి చేకూరుతుంది.


ఈ విధానం వల్ల ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను మాతృభాషలో నిర్వహించడం ద్వారా విద్యార్థులు ఈజీగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. మంచి స్కోరు సాధించేందకు సహాయపడుతుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.


ప్రస్తుతం ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయినా నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇది నీట్ అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించబడుతుంది.