Central Govt : దేశంలో తొలిసారి డిజిటల్‌ మీడియాకు కళ్లెం!

బ్రిటిష్‌ కాలంనాటి ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బుక్స్‌ యాక్ట్‌ స్థానంలో తీసుకురానున్న తాజా రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ అండ్‌ పీరియాడికల్స్‌ బిల్లు ప్రకారం.. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోపు డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్లు రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ వద్ద దరఖాస్తు చేసుకోవాలి.

Central Govt : దేశంలో తొలిసారి డిజిటల్‌ మీడియాకు కళ్లెం!

Digital Media

digital news sites : దేశంలో తొలిసారి డిజిటల్‌ మీడియాకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. చట్ట నిబంధనలను డిజిటల్‌ న్యూస్‌ సైట్స్‌ ఉల్లంఘిస్తే జరిమానాలు విధించడంతోపాటు.. వాటి రిజిస్ట్రేసన్‌ను కూడా రద్దు చేసేలా కేంద్ర సమాచార ప్రసారశాఖ బిల్లును సిద్ధం చేస్తోంది. వచ్చేవారం ప్రారంభమయ్యే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో దానిని ప్రవేశపెట్టనుంది. ఒకసారి ఈ సవరణ బిల్లు గనుక ఆమోదం పొందితే.. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వార్తలు అందించే డిజిటల్ సైట్లు చట్ట పరిధిలోకి వస్తాయి.

దాంతో ఉల్లంఘనలకు పాల్పడిన వార్తా సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. పెనాల్టీ విధించడం, రిజిస్ట్రేషన్ రద్దు చేయడం వంటి నిబంధనలు అమలవుతాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియను సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దానిలో భాగంగా రిజిస్ట్రేషన్‌ ఆఫ్ ప్రెస్‌ అండ్ పీరియాడికల్స్ బిల్లులో సవరణలు తేనుంది.

YouTube channels: తప్పుడు వార్తల ప్రసారం.. యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం

బ్రిటిష్‌ కాలంనాటి ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బుక్స్‌ యాక్ట్‌ స్థానంలో తీసుకురానున్న తాజా రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ అండ్‌ పీరియాడికల్స్‌ బిల్లు ప్రకారం.. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోపు డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్లు రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ వద్ద దరఖాస్తు చేసుకోవాలి.

ఉల్లంఘనలకు పాల్పడే పబ్లిషర్లపై చర్యలు తీసుకునే అధికారం, రిజిస్ట్రేషన్లను రద్దుచేయడం వంటి అధికారాలు కూడా ఈయనకు ఉన్నాయి. ఆయా చర్యలపై అప్పీలుకు వెళ్లేందుకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ సారథ్యంలో అప్పిలేట్‌ బోర్డు ఏర్పాటు చేయాలనే యోచన ఉంది.