Modi slams Congress: కాంగ్రెస్ మోడల్ అంటే ఏంటో తెలుసా?: ప్రధాని మోదీ

కాంగ్రెస్ మోడల్ అంటే బంధుప్రీతి, కులతత్వం, మతోన్మాదం, ఓటు బ్యాంకు రాజకీయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ మెహ్సానాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ప్రజల్లో చీలికలు తీసుకువస్తారని చెప్పారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్ ను మాత్రమే కాకుండా భారత్ మొత్తాన్నీ నాశనం చేస్తుందని అన్నారు.

Modi slams Congress: కాంగ్రెస్ మోడల్ అంటే ఏంటో తెలుసా?: ప్రధాని మోదీ

Modi slams Congress: కాంగ్రెస్ మోడల్ అంటే బంధుప్రీతి, కులతత్వం, మతోన్మాదం, ఓటు బ్యాంకు రాజకీయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ మెహ్సానాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ప్రజల్లో చీలికలు తీసుకువస్తారని చెప్పారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్ ను మాత్రమే కాకుండా భారత్ మొత్తాన్నీ నాశనం చేస్తుందని అన్నారు.

అందుకే మనం కష్టపడి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పుకొచ్చారు. గత 20 ఏళ్లలో గుజరాత్ ఎంతగానో మారిపోయిందని మోదీ అన్నారు. గతంలో గుజరాత్ ఎదుర్కొన్న కరవు పరిస్థితులు ప్రస్తుత తరం వారికి తెలియవని చెప్పారు. ప్రస్తుత తరం వారికి ఆయా బాధలు తెలియట్లేవంటే గత తరం వారు కష్టపడి చేసిన పనే కారణమని అన్నారు.

కాగా, ప్రధాని మోదీ నేడు దాహోద్, వడోదర, భావనగర్ లోనూ ర్యాలీల్లో పాల్గొననున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 1, 5న (రెండు దశల్లో) జరగనున్నాయి. వాటి ఫలితాలు, అలాగే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 8న వెలువడుతాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..