Corona XBB.1.5 Variant : భారత్ లోకి ప్రవేశించిన ప్రమాదకర కరోనా XBB.1.5 వేరియంట్.. గుజరాత్ లో తొలి కేసు నమోదు

ప్రమాదకరమైన కరోనా XBB.1.5 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి కేసు నమోదు అయింది. ఈ కొత్త వేరియంట్ ను గుజరాత్ లో గుర్తించారు. గత వేరియంట్ BQ.1పోలిస్తే 120 రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని అమెరికాన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Corona XBB.1.5 Variant : భారత్ లోకి ప్రవేశించిన ప్రమాదకర కరోనా XBB.1.5 వేరియంట్.. గుజరాత్ లో తొలి కేసు నమోదు

CORONA

Corona XBB.1.5 variant : ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనాలో బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి.  బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి కూడా ప్రవేశించింది. దేశంలో మూడు వేరియంంట్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరో ప్రమాదకరమైన కరోనా XBB.1.5 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి కేసు నమోదు అయింది. ఈ కొత్త వేరియంట్ ను గుజరాత్ లో గుర్తించారు. గత వేరియంట్ BQ.1పోలిస్తే 120 రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని అమెరికాన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఈ కొత్త వేరియంట్ ను ఇటీవలే అమెరికాలో కనుగొన్నారు. ఈ వేరియంట్ ను సూపర్ వేరియంట్ గా నిపుణులు పేర్కొంటున్నారు. దీని కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది అన్ని రకాల వేరియంట్ల కంటే వేగంగా మన రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకతను కలిగి ఉందని చైనీస్ ములాలున్న అమెరికన్ ఆరోగ్య నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్ ను గుర్తించిన 17 రోజుల్లోనే అనేక మంది అనారోగ్యానికి గురయ్యారు. BQ.1 ఆర్ వ్యాల్యూ కంటే దీని ఆర్ వ్యాల్యూ అధికం.

Corona Waves WHO Warned : భవిష్యత్ లో మరిన్ని కరోనా వేవ్ లు తప్పవు.. హెచ్చరించిన డబ్ల్యూహెచ్ వో

BQ.1 కన్నా 108 శాతం వేగంగా విస్తరిస్తోంది. క్రిస్మస్ కన్నా ముందుగానే దీని వ్యాప్తి మొదలైంది.
ఇప్పుడు దీని విస్తరణ వేగం 120 శాతంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. గత రెండు వారాల్లో కొత్త వేరియంట్ బారిన పడినవారి సంఖ్యను సీడీసీ వెల్లడించలేదని ఎరిక్ తెలిపారు.
చైనా మాదిరిగానే అమెరికా కూడా కొత్త వేరియంట్ డాటాను దాచి పెడుతోందని ఆరోపించారు.

కేవలం 40 శాతం విస్తరణ వేగం ఉన్న చెప్పేదంతా అబద్ధమని ఆయన కొట్టి పడేశారు. అమెరికాలోని నగరాల్లో XBB.1.5 వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తోంది. అమెరికా నుంచి ఇతర దేశాలకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందినట్లు నిపుణులు వెల్లడించారు. సింగపూర్ లో కనుగొన్న XBB.1.5 వేరియంట్ కన్నా 96 శాతం వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు.

BF7 Omicron Variant : బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ తో ముప్పు ఎక్కువే.. ఒకరి నుంచి 18 మందికి వేగంగా వ్యాప్తి, వైరస్ లక్షణాలేంటి?

న్యూయార్క్ లో కొత్త వేరియంట్ అక్టోబర్ లోనే వ్యాప్తి చెందడం ప్రారంభమైందని ఎరిక్ స్పష్టం చేశారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మాదిరిగా లేకపోవడం వల్ల దీని ప్రమాదంపై ప్రజలను ప్రభుత్వం హెచ్చరించలేకపోయిందని నిపుణులు వెల్లడించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మాదిరిగా కాకుండా ప్రత్యేక రీకాంబినేషన్ అని, ఇది పరివర్తన చెందిన రెండు కరోనా వేరియంట్లతో రూపొందినట్లుగా పరిశోధకులు కనుగొన్నారు.