Muhurtam : ముహూర్తం బాలేదని 11 ఏళ్లుగా అత్తారింట్లో అడుగుపెట్టని కోడలు.. చివరకు

పెళ్లయిన తర్వాత భార్య తన భర్తతో విడిగా జీవిస్తుంటే, ఆ భర్త విడాకులు తీసుకునేందుకు అర్హుడని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Muhurtam : ముహూర్తం బాలేదని 11 ఏళ్లుగా అత్తారింట్లో అడుగుపెట్టని కోడలు.. చివరకు

Muhurtam

Muhurtam : పెళ్లయిన తర్వాత భార్య తన భర్తతో విడిగా జీవిస్తుంటే, ఆ భర్త విడాకులు తీసుకునేందుకు అర్హుడని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అటువంటి సందర్భాలలో భర్త హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం విడాకుల డిక్రీని పొందవచ్చని తెలిపింది. జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ రజనీ దూబేలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.

చదవండి : Chhattisgarh : పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో యువకుడిని కాల్చి చంపిన మావోయిస్టులు

పెళ్లై 11 ఏళ్లు అయినా భార్య తల్లిగారి ఇంటి నుంచి అత్తింటికి రాకపోవడంతో భర్తకు కోర్టుకెక్కాడు. ఈ కేసులో భర్తకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ధర్మాసనం. కాగా ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకొంది. రాయ్‌గఢ్‌లో నివసిస్తున్న సంతోష్‌సింగ్‌కు జంజ్‌గిర్‌లో నివాసం ఉంటున్న అమిత సింగ్‌తో 2010 జూలై 7న వివాహం జరిగింది. సంతోష్ సింగ్ ప్రైవేట్ టీచర్, అమితా సింగ్ కూడా టీచర్.

చదవండి : Encounter In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్..పలువురు మావోయిస్టులు మృతి

పెళ్లయిన 11 రోజుల తర్వాత అమితా సింగ్ తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె తిరిగి అత్తగారి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో సంతోష్ సింగ్ ఆమెను తీసుకురావడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ, అమితా సింగ్ భర్తతో వచ్చేందుకు ఇష్టపడలేదు. అత్తారింటికి వచ్చేందుకు ముహూర్తం సరిగా లేదని పదే పదే చెబుతూ వచ్చింది. ఈ విధంగా 11 ఏళ్లకు పైగా గడిచినా అమితా సింగ్, కుటుంబ సభ్యులకు శుభ ముహూర్తం రాలేదు.

చదవండి : Encounter At Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు-మావోయిస్టు కమాండర్ మృతి

దీంతో వైవాహిక జీవితాన్ని భార్యతో గడపాలని సంతోష్ సెక్షన్ 9 కింద కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో అమితా సింగ్‌కు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఆమె హాజరు కాలేదు. భార్యాభర్తలిద్దరూ కలిసి జీవించాలని కోర్టు అమితా సింగ్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఆమె తన భర్తతో కలిసి జీవించడానికి అంగీకరించలేదు. దీంతో సంతోష్‌ రాయ్‌గఢ్‌లోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దావా వేశారు. దీన్ని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సంతోష్ సింగ్ తన న్యాయవాది సౌరభ్ శర్మ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విడాకుల ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు భర్తకు అనుకూలంగా తీర్పునిస్తూ విడాకులు తీసుకోవాలని ఆదేశించింది.