Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. తెరపైకి ఖార్గే పేరు.. నేటితో నామినేషన్ల గడువు పూర్తి..

నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్‌లు నేడు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరిలో ఎవరోఒకరు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మల్లిఖార్జున్ ఖార్గే సైతం నేడు అధ్యక్ష ఎన్నికల బరిలోనిలిచేందుకు నామినేషన్ వేస్తారని పార్టీ వరాలు పేర్కొంటున్నాయి.

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. తెరపైకి ఖార్గే పేరు.. నేటితో నామినేషన్ల గడువు పూర్తి..

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో తాను లేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టం చేసిన విషయం విధితమే. సోనియాతో భేటీ అయిన ఆయన రాజస్థాన్ కాంగ్రెస్ లో జరిగిన పరిణామాలపై క్షమాపణలుసైతం చెప్పారు. అధ్యక్ష బరినుంచి గెహ్లాట్ తప్పుకోవటంతో శశిథరూర్ తో పాటు దిగ్విజయ్ సింగ్ లు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో వారిరువురు నేడు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

Sachin Pilot Meets Sonia: సోనియాగాంధీతో సచిన్ పైలట్ భేటీ.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కీలక మార్పులు తప్పవా?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఖర్గే సైతం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియాగాంధీతో గురువారం అర్థరాత్రి ఖర్గే ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఖర్గే అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం (సెప్టెంబర్ 30న) కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గురువారం అర్థరాత్రి సోనియా గాంధీతో ఫోన్ కాల్ చేసిన తర్వాత ఖర్గే పేరు ఖరారైంది. రాహుల్ గాంధీసైతం ఖర్గే అభ్యర్థిత్వానికి మద్దతుగా ఉన్నారని రాహుల్ సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి.

Congress President Poll: ఒకే ఒరలో రెండు కత్తులు.. దిగ్విజయ్ సింగ్‭ను కలుసుకున్న శశి థరూర్

రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్‌తో సోనియా గాంధీ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఖర్గే ఎల్లప్పుడూ అధ్యక్ష బరిలో నిలిచేందుకు అర్హుడు. కానీ, అతని వయస్సు, ప్రతిపక్ష నాయకుడిగా (రాజ్యసభలో) ప్రస్తుత బాధ్యత కారణంగా సందేహాలు ఉన్నాయని ముకుల్ వాస్నిక్ తెలిపాడు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే పేరు దాదాపు ఖరారైందని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.

Crime News: దృశ్యం సినిమా పది సార్లు చూసి.. ప్రియుడితో తండ్రిని హత్య చేయించిన కుమార్తె.. సహకరించిన తల్లి.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. శుక్రవారం శశి థరూర్, దిగ్విజయ్ సింగ్ లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అయితే ఖర్గే సైతం అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, గాంధీ కుటుంబం మాత్రం ఖార్గేను ఫైనల్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సులో ఉన్న ఖర్గే కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన దళిత నేత. అతను 1960 లలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. కలబుర్గి జిల్లాలోని (అప్పటి గుల్బర్గా) గుర్మిట్‌కల్ నియోజకవర్గం నుండి తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాడు. కర్నాటకలో తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, రెవెన్యూ, హోం వంటి శాఖల మంత్రిగా పనిచేశారు. 2009లో అతను గుల్బర్గా నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచాడు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. లేబర్ పోర్ట్‌ఫోలియో, తరువాత రైల్వే శాఖ మంత్రిగానూ పనిచేశాడు. 2014లో మళ్లీ గెలిచి లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడయ్యారు. 2019లో ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించడంతో 2021లో ప్రతిపక్ష నేత అయ్యారు.