Agnipath scheme: ఆ వివరాలను వెల్లడించలేం.. అగ్నిపథ్ పథకంపై స్పష్టత ఇచ్చిన రక్షణ మంత్రిత్వ శాఖ

అగ్నిపథ్ పథకం గురించిన వివరాలను సమాచార హక్కు (ఆర్‌టిఐ) కింద పంచుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఈ వివరాలు రహస్యమని వెల్లడిస్తూ పూణేకు చెందిన ఆర్‌టిఐ కార్యకర్త విహార్ దుర్వే కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇందుకు గల కారణాలనుసైతం వివరించారు.

Agnipath scheme: ఆ వివరాలను వెల్లడించలేం.. అగ్నిపథ్ పథకంపై స్పష్టత ఇచ్చిన రక్షణ మంత్రిత్వ శాఖ

Agnipath scheme

Agnipath scheme: భారత సైన్యంలో చేరేందుకు కలలు కంటున్న యువతకు తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం అగ్నిపథ్ పథకంను అమల్లోకి తెచ్చింది. ఈ పథకం అమలుతీరుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అయినా రిక్రూట్ మెంట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. అయితే.. అగ్నిపథ్ పథకం గురించిన వివరాలను సమాచార హక్కు (ఆర్‌టిఐ) కింద పంచుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించింది.

Agnipath: 3 వేల ఉద్యోగాలకు నోటిఫికేష‌న్.. 9.55 ల‌క్ష‌ల‌ మంది ద‌ర‌ఖాస్తులు

ఈ వివరాలు రహస్యమని వెల్లడిస్తూ పూణేకు చెందిన ఆర్‌టిఐ కార్యకర్త విహార్ దుర్వే కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇందుకు గల కారణాలనుసైతం వివరించారు. పారదర్శకత చట్టంలోని సెక్షన్‌లు 8, 9 పరిధిలోకి ఈ పథకం రాలేదని ఆర్‌టిఐ నిపుణులు తెలిపారు. సెక్షన్ 8, 9 జాబితా నిబంధనల ప్రకారం సమాచారాన్ని తిరస్కరించవచ్చునని పేర్కొన్నారు. 2022 జూలై 14న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విలేకరుల సమావేశంలో సైనిక రిక్రూట్‌మెంట్ స్కీమ్ (అగ్నిపథ్‌)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ పథకం బహిరంగంగా ప్రకటించబడినందున.. మంత్రిత్వ శాఖలో ఈ పథకంపై జరిగిన చర్చలు, ఇప్పటికే ఉన్న రిక్రూట్‌మెంట్, స్కీమ్‌ను భర్తీ చేయడానికి, దీనిని ప్రవేశపెట్టడానికి గల కారణాలపై సమాచారాన్ని కోరుతూ విహార్ దుర్వే 23 జూలై 2022 నాడు తన ఆర్టీఐ దరఖాస్తులో కోరాడు.

Agnipath Recruitment 2022: భారత నావికాదళంలో రిక్రూట్‌మెంట్ కోసం భారీగా దరఖాస్తులు.. ఎన్ని వచ్చాయంటే?

దుర్వే ఈ పథకం కింద రిక్రూట్‌లకు చెల్లింపు ప్యాకేజీలు, అలవెన్సులకు సంబంధించిన విషయాల గురించికూడా వివరాలు కోరాడు. దేశంలోని వివిధ ప్రాంతాలలో సాయుధ దళాలకు రిక్రూట్‌మెంట్ నిర్వహించడం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ ఆగస్టు మొదటి వారం నుండి అమలు చేసిన పథకం గురించి సమాచారాన్ని ఇవ్వలేమని సైనిక వ్యవహారాల విభాగం సమాచార అధికారి నిరాకరించారు.