DGCA : విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు..నిబంధనలు కఠినతరం చేసిన డీజీసీఏ

బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్‌ ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే విమానాలను బయటకు పంపాలనే నిబంధనను తప్పనిసరి చేసింది.

DGCA : విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు..నిబంధనలు కఠినతరం చేసిన డీజీసీఏ

Dgca

DGCA rules : విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్‌ ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే విమానాలను బయటకు పంపాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. ఈనెల 28 నుంచి అన్ని విమానయాన సంస్థలు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

గడిచిన నెల రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడి అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యాయి. ముఖ్యంగా స్పైస్‌జెట్‌, ఇండిగో విమానాల్లో ఈ సమస్యలు తలెత్తాయి. ఆదివారం సైతం రెండు విమానాలు అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యాయి. ఇండిగో విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు.

IndiGo: హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం.. పాకిస్తాన్‍లో ల్యాండింగ్

షార్జా నగరం నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఈ విమానంలో మార్గమధ్యంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్‌ గుర్తించి అత్యవసరంగా కరాచీలో ల్యాండ్‌ చేశారు. కాలికట్ నుంచి దుబాయ్‌కి వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. అత్యవసరంగా మస్కట్‌లో ల్యాండ్‌ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ పరిణామాలతో నిబంధనలు కఠినతరం చేసింది.