Stock Market : పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్..చరిత్ర సృష్టించిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పుంజుకున్నాయి. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) చరిత్ర సృష్టించింది. ఎన్ఎస్ఈ సూచీ కీలక 16 వేల మార్క్ దాటింది.

Stock Market : పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్..చరిత్ర సృష్టించిన నిఫ్టీ

Stock Market

stock market : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పుంజుకున్నాయి. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) చరిత్ర సృష్టించింది. ఎన్ఎస్ఈ సూచీ కీలక 16 వేల మార్క్ దాటింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) సైతం గరిష్టాల వద్ద పయనిస్తోంది.

కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుందనే సంకేతాలు, తయారీ కార్యకలాపాలు మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు 33 శాతం పుంజుకోవడం వంటి సానుకూల సంకేతాలు షేర్ హోల్డర్స్ లో విశ్వాసం నింపాయి. అదేవిధంగా హెచ్ డీఎఫ్ సీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, హెచ్ యూఎల్ తదితర కీలక కంపెనీల షేర్లు రాణించాయి.

మధ్యాహ్నం 12.37 గంటలకు సెన్సెక్స్ 508 పాయింట్ల లాభంతో 53,459 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు లాభ పడి 16,018 వద్ద ట్రేడ్ అవుతోంది. మెజారిటీ రంగాల షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. టైటన్, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల బాట పట్టాయి. కాగా ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ, టాటా స్టీల్ నష్టాల్లో ఉన్నాయి.