Shahjahanpur : నిద్ర వస్తోంది.. ట్రైన్ నడుపలేనన్న డ్రైవర్

షాజహాన్ పూర్ స్టేషన్ కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. తిరిగి ఏడు గంటలకు ట్రైన్ నడపడానికి డ్రైవర్ నిరాకరించారు. రాత్రి సరిగ్గా నిద్ర లేదని ట్రైన్ నడుపలేనని...

Shahjahanpur : నిద్ర వస్తోంది.. ట్రైన్ నడుపలేనన్న డ్రైవర్

Train Driver

Driver Takes Break To Sleep : డ్యూటీ టైం ముగిసిందంటూ…విమానాన్ని మధ్యలోనే పైలట్ వెళ్లిపోయిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. తనకు నిద్ర వస్తోందని..అందుకని ట్రైన్ నడుపలేనని ఓ డ్రైవర్ ఖరాఖండిగా చెప్పేశాడు. నిద్ర నుంచి లేచిన తర్వాతే..ట్రైన్ ను నడిపిస్తానని చెప్పడంతో ప్రయాణీకులు కొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. షాజహాన్ పూర్ స్టేషన్ కు గురువారం రాత్రి ఆలస్యంగా ప్యాసింజర్ రైలు చేరుకుంది.

Read More : Ambati Rambabu : ఫిలిం సిటీలో బెల్లీ డ్యాన్సులు..! అడిగే దమ్ముందా? అంబటి రాంబాబు

తిరిగి..దీనిని తిరిగి ఉదయం 7 గంటలకు బాలామావూకు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ..షాజహాన్ పూర్ స్టేషన్ కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. తిరిగి ఏడు గంటలకు ట్రైన్ నడపడానికి డ్రైవర్ నిరాకరించారు. రాత్రి సరిగ్గా నిద్ర లేదని ట్రైన్ నడుపలేనని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో ప్యాసింజర్ రైలు అలా పట్టాలపైనే ఉండిపోయింది. దాదాపు మూడున్నర గంటల పాటు ప్రయాణీకులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటణపై షాజహాన్ పూర్ రైల్వే అధికారి అమరేంద్ర గౌతమ్ రెస్పాండ్ అయ్యారు. రోజా సంక్షన్ లో డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటారని, తర్వాత ట్రైన్ లను తిరిగి తీసుకెళుతారని తెలిపారు. నిద్ర పూర్తయిన తర్వాత రైలును తీసుకెళ్లాడన్నారు.