Election Commission : ఎన్నికల్లో ఒకరు ఒకచోట నుంచే పోటీ!

2004లో తొలిసారి ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల కోసం ఈ ప్రతిపాదన చేశారు. ప్రస్తుత ఎన్నికల నిబంధనలు, నియమావళి ప్రకారం ఏ ఎన్నికల్లో అయినా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసుకోచ్చు.

Election Commission : ఎన్నికల్లో ఒకరు ఒకచోట నుంచే పోటీ!

Cec

Election Commission : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్‌ సూచించింది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని కోరింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే… బలవంతంగా ఉప ఎన్నికలకు దారితీసే అభ్యర్థులకు భారీగా జరిమానా విధించాలని సూచించింది. రెండు దశాబ్ధాల నాటి ప్రతిపాదనను ఈసీ మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, ఇటీవల న్యాయ మంత్రిత్వ శాఖలోని శాసనసభ కార్యదర్శితో సమావేశమయ్యారు.

2004లో తొలిసారి ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల కోసం ఈ ప్రతిపాదన చేశారు. ప్రస్తుత ఎన్నికల నిబంధనలు, నియమావళి ప్రకారం ఏ ఎన్నికల్లో అయినా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసుకోచ్చు. ఆ అభ్యర్థి ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఒక స్థానాన్ని మాత్రమే ఉంచుకుని.. మిగతా స్థానాలకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇలా ఖాళీ అయిన ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి అవసరం ఏర్పడుతుంది.

President Election 2022: ప్రెసిడెన్షియల్ ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎలక్షన్ కమిషన్

ఈ నేపథ్యంలో 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించారు. ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా నియంత్రించారు. ఈ నేపథ్యంలో 2004లో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని సెక్షన్‌ల సవరణను ఎన్నికల కమిషన్‌ ఆమోదించింది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకూడదని సూచించింది.