Covovax Booster Dose : బూస్టర్ డోస్ గా కోవోవాక్స్ టీకా

సీరం కంపెనీకి చెందిన కోవోవాక్స్ టీకాలు బూస్టర్ డోస్ గా నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కోవోవాక్స్ బూస్టర్ డోస్ గా ఇచ్చేందుకు ఇచ్చేందుకు సిఫారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Covovax Booster Dose : బూస్టర్ డోస్ గా కోవోవాక్స్ టీకా

COVOVAX

Covovax Booster Dose : సీరం కంపెనీకి చెందిన కోవోవాక్స్ టీకాలు బూస్టర్ డోస్ గా నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కోవోవాక్స్ బూస్టర్ డోస్ గా ఇచ్చేందుకు ఇచ్చేందుకు సిఫారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరికీ కోవోవాక్స్ టీకా హెటెరో లాగస్ బూస్టర్ డోస్ గా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Covid Variant BF.7 : మాస్కులు మస్ట్, బూస్టర్ డోస్ తీసుకోవాలి- కరోనా కొత్త వేరియంట్‌పై కేంద్రం హెచ్చరిక

కంపెనీకి చెందిన డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ సమీక్షించింది. ఈ మేరకు సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ నోవావాక్స్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను సీరమ్ కంపెనీ కోవోవాక్స్ పేరుతో ఉత్పత్తి చేస్తోంది.