Old Man To Hospital On Cart : తోపుడు బండిపై ఆస్పత్రికి వృద్ధుడి త‌ర‌లింపు.. ముగ్గురు జ‌ర్న‌లిస్టుల‌పై కేసు నమోదు

ఓ కుటుంబం త‌మ ఇంట్లో వృద్ధుడికి వైద్య చికిత్స కోసం తోపుడు బండిపై ఐదు కిలోమీట‌ర్లు తోసుకెళ్లిన ఘ‌ట‌న మీడియాలో వ‌చ్చింది. అందుకు కార‌ణం ముగ్గురు స్థానిక విలేక‌రులు అంటూ వారిపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. వివిధ సామాజిక వ‌ర్గాల మ‌ధ్య శ‌తృత్వాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని, మోస‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఐటీ చ‌ట్టంలోని వివిధ సెక్ష‌న్ల కింద స‌ద‌రు జ‌ర్న‌లిస్టుల‌పై కేసు న‌మోదు చేశారు.

Old Man To Hospital On Cart : తోపుడు బండిపై ఆస్పత్రికి వృద్ధుడి త‌ర‌లింపు.. ముగ్గురు జ‌ర్న‌లిస్టుల‌పై కేసు నమోదు

Old Man To Hospital On Cart

Old Man To Hospital On Cart : ఓ కుటుంబం త‌మ ఇంట్లో వృద్ధుడికి వైద్య చికిత్స కోసం తోపుడు బండిపై ఐదు కిలోమీట‌ర్లు తోసుకెళ్లిన ఘ‌ట‌న మీడియాలో వ‌చ్చింది. అందుకు కార‌ణం ముగ్గురు స్థానిక విలేక‌రులు అంటూ వారిపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. వివిధ సామాజిక వ‌ర్గాల మ‌ధ్య శ‌తృత్వాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని, మోస‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఐటీ చ‌ట్టంలోని వివిధ సెక్ష‌న్ల కింద స‌ద‌రు జ‌ర్న‌లిస్టుల‌పై కేసు న‌మోదు చేశారు. ఆయా విలేక‌రులు త‌ప్పుడు, నిరాధార వార్త రిపోర్ట్ చేశార‌ని అభియోగం ఉంది. కానీ, తాము బాధ‌ప‌డిన మాట వాస్తవం, త‌మ కుటుంబ పెద్ద‌ను తోపుడు బండిపై తోసుకెళ్లింది నిజ‌మేన‌ని బాధిత కుటుంబం చెబుతోంది.

ఈ ఘ‌ట‌న‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ భిండ్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌తీశ్ కుమార్ ఆదేశాల మేర‌కు ఏర్పాటైన రెవెన్యూ, హెల్త్ శాఖ‌ల ద‌ర్యాప్తు క‌మిటీ.. జ‌ర్న‌లిస్టులు కుంజ్‌బిహారీ కౌర‌వ్‌, అనిల్ శ‌ర్మ‌, ఎన్‌కే భాటెలెల‌పై కేసు న‌మోదు చేసింది. స‌ద‌రు కుటుంబం అంబులెన్స్ కోసం త‌మ‌కు ఫిర్యాదు చేయ‌లేద‌ని క‌లెక్ట‌ర్ స‌తీశ్ కుమార్ చెప్పారు. జ్ఞాన్ ప్ర‌సాద్ విశ్వ‌కర్మ‌ను తొలుత ప్ర‌యివేట్‌ ఆస్పత్రికి త‌ర‌లించార‌ని, ప్ర‌భుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ల‌లేద‌ని పేర్కొన్నారు.

Uttar Pradesh: దళితుడిపై దాడి.. కెమెరాలో రికార్డైన ఘటన.. నిందితుడి అరెస్ట్

కానీ, బాధిత కుటుంబం వాద‌న మ‌రోలా ఉంది. స‌ద‌రు రోగి కొడుకు హ‌రికృష్ణ‌, కూతురు పుష్ప మాట్లాడుతూ ఫోన్ కాల్ చేసినా.. అంబులెన్స్ రాలేద‌న్నారు. దీంతో తోపుడు బండిపై ఐదు కిలోమీట‌ర్ల వ‌ర‌కు తోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లామ‌ని చెప్పారు. భిండ్ జిల్లాలోని దాబోహ్ ప‌ట్ట‌ణానికి స‌మీపాన గ‌ల లాహ‌ర్ గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను ప‌లు మీడియా సంస్థ‌లు ప్ర‌సారం చేశాయి.