Father Supari Kill Daughter : కూతురి ప్రేమ వ్యవహారం..ఆమెను హత్య చేసేందుకు రూ.లక్ష సుపారీ ఇచ్చిన తండ్రి

ఉత్తర ప్రదేశ్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమలో పడిన కూతురుని హత్య చేయించేందుకు ఓ వ్యక్తికి లక్ష రూపాయల సుఫారీ ఇచ్చాడు. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆ తండ్రితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మీరట్‌ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Father Supari Kill Daughter : కూతురి ప్రేమ వ్యవహారం..ఆమెను హత్య చేసేందుకు రూ.లక్ష సుపారీ ఇచ్చిన తండ్రి

Father Supari Kill Daughter

Father Supari Kill Daughter : ఉత్తర ప్రదేశ్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమలో పడిన కూతురుని హత్య చేయించేందుకు ఓ వ్యక్తికి లక్ష రూపాయల సుఫారీ ఇచ్చాడు. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆ తండ్రితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మీరట్‌ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌ జిల్లాలోని కంకేర్ ఖేరాకు చెందిన నవీన్ కుమార్ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. అతని కుమార్తె ఒక వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం నవీన్‌ కుమార్‌కు తెలియడంతో అతడిని వదులుకోవాలని కూతురుకు చెప్పాడు.

అయితే తండ్రి మాటను ఆమె వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన కుమార్తె మేడ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన కుమార్తెను తండ్రి నవీన్‌ కుమార్‌ కంకేర్ ఖేరాలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను మోదీపురంలోని ఫ్యూచర్ ప్లస్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. మేడ మీద కోతులను చూసి భయంతో అక్కడి నుంచి దూకిందని వైద్యులకు చెప్పాడు.

Honor Killing : ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. గర్భవతని కూడా చూడకుండా..

అయితే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసిన కొంత సేపటి తర్వాత ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమించింది. పరిశీలించిన డాక్టర్లు ఆమెకు పొటాషియం క్లోరైడ్‌ను అధిక మోతాదుతో ఇంజెక్ట్ చేసినట్లు గ్రహించారు. దీంతో వెంటనే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆస్పత్రి వార్డ్‌ బాయ్‌ నరేశ్‌ కుమార్‌ ఆమెకు ఆ ఇంజెక్షన్‌ ఇచ్చినట్లుగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

వార్డ్‌ బాయ్‌ నరేశ్‌ కుమార్‌ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపెట్టాడు. కుమార్తెను చంపేందుకు ఆమె తండ్రి తనకు లక్ష రూపాయలు ఇచ్చాడని చెప్పాడు. మరో ఉద్యోగినితో కలిసి డాక్టర్‌ గెటప్‌లో ఐసీయూలోకి వెళ్లి ఆ మహిళకు పొటాషియం క్లోరైడ్‌ను అధిక మోతాదులో ఇంజెక్షన్‌ చేసినట్లు వెల్లడించాడు. దీంతో విరిగిన సిరంజీతోపాటు అతడి వద్ద ఉన్న రూ.90,000ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Attack On Couple: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి

వార్డు బాయ్‌ నరేశ్‌, అతడికి సహకరించిన ఉద్యోగినితోపాటు యువతి తండ్రి నవీన్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ప్రేమ వ్యవహారంపై కుమార్తెను హెచ్చరించినా మాట వినకపోవడంతో ఆమె హత్య కోసం వార్డ్‌ బాయ్‌కు రూ.లక్ష సుపారీ ఇచ్చినట్లుగా తండ్రి నవీన్‌ ఒప్పుకున్నాడు. ఆమె కోతి భయంతో మేడ పైనుంచి దూకలేదని, తమ మధ్య జరిగిన గొడవ వల్ల దూకిందని పోలీసులకు తెలిపాడు.