Electric Highway : ఇకపై భవిష్యత్తు ఇదే.. ఇండియా ఫస్ట్ ‘ఎలక్ట్రిక్ హైవే’ రాబోతోంది.. ఎక్కడంటే?

ఇకపై భవిష్యత్తు రవాణా ఇదే.. అన్నింటా ఎలక్ట్రిక్ వాహనాలే నడువున్నాయి. ఇందన వాహనాలకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అతి త్వరలో మనదేశానికి ఎలక్ట్రిక్ హైవే రాబోతోంది.

10TV Telugu News

electric highways in India : ఇకపై భవిష్యత్తు రవాణా ఇదే.. అన్నింటా ఎలక్ట్రిక్ వాహనాలే నడువున్నాయి. ఇందన వాహనాలకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అతి త్వరలో మనదేశానికి ఎలక్ట్రిక్ హైవే రాబోతోంది. ఇప్పటికే.. దేశంలో ఇందన ధరలు భారీగా పెరిగి పోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఎలక్ట్రిక్ వాహనాలవైపు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ తో నడిచే పెద్ద వాహనాలు రానున్నాయి. భారీ లోడుతో వెళ్లే వాహనాలు ఎక్కువగా హైవేలపై కనిపిస్తుంటాయి. వీటికి ఇందన అవసరం ఎక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఫుల్ ట్యాంక్ చేయాల్సిందే. అందులోనూ ఇంధన ధరలు ఆకాశాన్నింటాయి.

ఈ నేపథ్యంలో విదేశీ తరహాలో దేశంలో మొట్టమొదటిసారిగా హైవేలో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ టెక్నాలజీ రాబోతోంది. అంటే.. ఈ హైవేలో వెళ్లే అన్ని వాహనాలు పవర్ ద్వారా నడుస్తాయి. రైళ్లు, మెట్రో రైళ్లు ఎలా అయితే కరెంటుతో నడుస్తున్నాయో అలానే ఈ హైవే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పరుగులు పెట్టనున్నాయి. రెండేళ్ల క్రితమే ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని జర్మనీలో మొట్టమొదటిసారిగా నిర్మించారు. తద్వారా హైవేపై వెళ్లే క్రమంలో వాహన ట్రక్కులు అప్పటికప్పుడే రీచార్జ్ అవుతుంటాయి. ఇప్పుడు విదేశీ తరహాలో దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ జైపూర్ లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ బిగ్ డీల్ కు సంబంధించి విదేశీ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయని, ఇది తన డ్రీమ్ ప్రాజెక్టుగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. చర్చలు ముగిసిన వెంటనే ఈ రెండు నగరాల మధ్య ఎలక్ట్రిక్ హైవే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని గడ్కరీ తెలిపారు.
India : ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం

ఎలక్ట్రిక్ హైవే అంటే :
ప్రపంచవ్యాప్తంగా ఇందన ధరల పెంపుతో అందరూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇందన వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత రవాణా అభివృద్ధికి ఎలక్ట్రిసిటీ అనేది పవర్ ఫుల్ చాయిస్ గా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్టుపై ప్రతిపాదనలకు ఆమోదం లభించాల్సి ఉంది. అదేగాని జరిగితే.. ఎలక్ట్రిక్ హైవే రవాణాను మరింత విస్తరించడం ద్వారా అభివృద్ధి చెందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ముందుగా ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య ఈ ఎలక్ట్రిక్ హైవేను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే.. ఢిల్లీ-మంబై నగరాల మధ్య కూడా ఎలక్ట్రిక్ హైవే రానుంది.

ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం చిన్న వాహనాలకు మాత్రమే పరిమితం కాకూడదని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో హైవేలపై దూసుకెళ్లే బస్సులు, ట్రక్కులకు రైల్వే ఇంజిన్లకు కూడా ఎలక్ట్రిసిటీతో నడిచేలా చేయడమే తమ డ్రీమ్ ప్రాజెక్టు లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల స్థాయిలోనే ఉందని గడ్కరీ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి జైపూర్ కు ఎలక్ట్రిక్ హైవేను నిర్మించడమే తన డ్రీమ్ గా గడ్కరీ మీడియాకు వెల్లడించారు. విదేశీ కంపెనీతో చర్చల అనంతరం ఏదైనా నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకానికి స్వస్తిచెప్పి పూర్తిగా ఎలక్ట్రిక్ రెజుల్యుషన్ తీసుకురానున్నట్టు తెలిపారు.

భవిష్యత్తు రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలే కీలకం :
ఎలక్ట్రిక్ వాహనాలు (EV) అనేది ఎలక్ట్రిక్ మోటార్లు (ఎలక్ట్రిక్ కరెంట్ కలెక్టర్ సిస్టమ్) ఆధారంగా పనిచేస్తాయి. ఈవీ వాహనాల్లో బ్యాటరీని ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సోలార్ ప్యానెల్స్ లేదా ఇందనాన్ని ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేసి వాడుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ సిస్టమ్ టెక్నాలజీని కేవలం రోడ్డుపై నడిచే ఈవీ వాహనాలకు మాత్రమే పరిమితం కాకుండా రైల్వే, ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, అండర్ వాటర్ నౌకల్లో కూడా సిద్ధాంతపరంగా ఎలక్ట్రిసిటీ విధానాన్ని తీసుకురానుంది. ఇందనాలతో వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు విదేశీ తరహా ఎలక్ట్రిసిటీ వాహనాలను తీసుకురానుంది. అంతర్జాతీయ శక్తి సంస్థ (IAE) ప్రపంచ ప్రభుత్వాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలమైన విధానాలతో వాతావరణ లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాయి. భారత ప్రతిపాదిత ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్ట్ ఆ దిశగా కొనసాగే అవకాశ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!