Prostitution : చెల్లిని వ్యభిచారంలోకి దింపిన అక్క .. విటుడి చేతిలో హత్య

ఏడు నెలల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల బాలిక మృతదేహం జార్ఖండ్‌లోని సోనార్ డ్యామ్ సమీపంలో లభించింది. మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు.

10TV Telugu News

Prostitution :  ఏడు నెలల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల బాలిక మృతదేహం జార్ఖండ్‌లోని సోనార్ డ్యామ్ సమీపంలో లభించింది. మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు. మైనర్‌ని ఆమె సోదరీమణులు రాఖీ దేవి (30) రూప దేవి (25), బావ ధనంజయ్ అగర్వాల్ (30) ప్రేమికులు ప్రతాప్ కుమార్ సింగ్, నితీష్ లు హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

చదవండి : Murder Attempt On Wife : కాపురానికి రావట్లేదని భార్యపై హత్యాయత్నం

ఇక ఈ హత్యకేసులో నిందితులుగా ఉన్న వారిలో నితీష్ మినహా అందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, మృతురాలి తలపై బలమైన గాయం ఉంది. అయితే ఆమె అక్కలు మాత్రం తమ చెల్లి ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లుగా చెబుతున్నారు.

ఈ కేసు గురించి సబ్ డివిజినల్ పోలీస్ అధికారి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అక్క రాఖీ, బావ ధనుంజయ్..బాలికను వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేసేవారని.. కస్టమర్లదగ్గరకు పంపేవారని తెలిపారు. బాలికకు ప్రియుడు ఉన్నట్లు ఆమె అతడిని పెళ్లిచేసుకోవడానికి సిద్దమైనప్పుడు అక్క, బావ మందలించి పెళ్లి చెడగొట్టారని వివరించారు.]

చదవండి : Man Murder : చేతబడి చేస్తున్నాడనే నెపంతో గిరిజనుడి హత్య

ప్రతాప్, నితీష్‌లు అనేక సార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని.. వివరించారు. ఎవరు లేని సమయంలో ఇంట్లో దూరిన నితీష్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడని.. ఆత్మహత్యగా క్రియేట్ చేసేందుకు బాలిక మృతదేహాన్ని ఉరితీశారని తెలిపారు. హత్య తర్వాత బాలిక అక్కకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపి అనంతరం అందరు కలిసి కారులో మృతదేహం తీసుకెళ్లి పూడ్చిపెట్టారని పోలీస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు.