Vaccine Side-effects: భారత్‌లో వ్యాక్సిన్ వల్ల చనిపోయిన తొలివ్యక్తి ఇతనే.. ప్రకటించిన ప్రభుత్వం!

భారత్‌లో కోవిడ్-19 నాలుగో దశ వ్యాక్సినేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు కరోనావైరస్ సెకండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. అందుకు కారణం వ్యాక్సినేషన్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ వికటించి ఓ వ్యక్తి మరణించిన ఘటన భారత్‌లో చోటుచేసుకుంది.

Vaccine Side-effects: భారత్‌లో వ్యాక్సిన్ వల్ల చనిపోయిన తొలివ్యక్తి ఇతనే.. ప్రకటించిన ప్రభుత్వం!

Vaccine (1)

Govt confirms First Death: భారత్‌లో కోవిడ్-19 నాలుగో దశ వ్యాక్సినేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు కరోనావైరస్ సెకండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. అందుకు కారణం వ్యాక్సినేషన్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ వికటించి ఓ వ్యక్తి మరణించిన ఘటన భారత్‌లో చోటుచేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ వికటించి 68 ఏళ్ల ఓ వ్యక్తి చనిపోయినట్లు వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ( AEFI-The National Adverse Event Following Immunisation) నివేదికలో వెల్లడించింది.

వ్యాక్సిన్ దుష్ప్రభావంతో దేశంలో నమోదైన తొలి మరణం ఇదేనని, గతంలో వ్యాక్సిన్ వికటించి పలువురు మృతి చెందినట్లు ప్రచారం జరిగినప్పటికీ ప్రభుత్వం వ్యాక్సిన్‌తో ఆ మరణాలకు సంబంధం లేదని స్పష్టంచేసింది. వ్యాక్సిన్ దుష్ప్రభావాలతో చనిపోయినట్లుగా చెప్పబడుతున్న 31 కేసులను నిపుణుల కమిటీ అధ్యయనం చేయగా.. ఇందులో 68 ఏళ్ల వృద్దుడు మాత్రమే వ్యాక్సినేషన్ తర్వాత అనాఫిలాక్సిస్‌ బారినపడినట్లు చెబుతున్నారు.

సదరు వ్యక్తి మార్చి 8వ తేదీన వ్యాక్సిన్ తీసుకోగా.. అనాఫిలాక్సిస్(Anaphylaxis) బారిన పడ్డారని, ఆ కారణంగానే మృతి చెందినట్లు నిర్దారించారు. వ్యాక్సిన్ సంబంధిత రియాక్ష‌న్లు ముందుగా ఊహించిన‌వేనని, అత్యవసర వినియోగానికి అవకాశం ఇచ్చినప్పుడు ఇటువంటివి ఊహించినట్లు ప్యానెల్ చెప్పింది. మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా వ్యాక్సిన్ త‌ర్వాత అన‌ఫిలాక్సిస్ బారిన ప‌డ్డారని, అయితే చికిత్స తర్వాత వాళ్లు కోలుకున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.