త్వ‌ర‌లో సీర‌మ్ నుంచి 5 కోట్ల వ్యాక్సిన్లు కొనుగోలు

త్వ‌ర‌లో సీర‌మ్ నుంచి 5 కోట్ల వ్యాక్సిన్లు కొనుగోలు

Purchase 5 crore vaccines from Serum : ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు నిర్మూలన దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. భార‌త ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 5 కోట్ల ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఒక‌టి, రెండు రోజుల్లో ఈ వ్యాక్సిన్‌కు భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడ‌క్ట్స్ రెగ్యులేట‌రీ ఏజెన్సీ ఆమోదం తెలిపిన త‌ర్వాత ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం ఉంది. సీర‌మ్ నుంచి వ్యాక్సిన్ల‌ను సేక‌రించిన త‌ర్వాత జ‌న‌వ‌రిలో వాటిని రాష్ట్రాల‌కు పంపిణీ చేయ‌నుంది.

వ‌చ్చే నెల నుంచే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. తొలి ద‌శ‌లో భాగంగా వ్యాక్సిన్ ఎవ‌రికి ఇవ్వాలో రాష్ట్రాలు జాబితా త‌యారు చేయాల‌ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.